Flight Door opened:ఆకాశంలో ఉండగానే ఊడిపోయిన విమానం డోర్..ప్రయాణికులు ఎలా వణికారో చూడండి...

171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన ఓ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. చాలా ఎత్తుకు ఎగిరిపోయింది కూడా. 16వేల అడుగల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానం డోర్ హఠాత్తుగా ఊడిపోయింది. దీంతో 20 నిమిషాల పాటూ ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టకుని కూర్చున్నారు.

Flight Door opened:ఆకాశంలో ఉండగానే ఊడిపోయిన విమానం డోర్..ప్రయాణికులు ఎలా వణికారో చూడండి...
New Update

Flight Door:విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న కుదుపు వస్తేనే భయపడిపోతాం మనం. పైలట్ బెల్ట్ పెట్టుకుని కూర్చోమంటే...అమ్మో ఏమైపోతోందో అని ఆందోళన పడిపోతాం...అలాంటిది ఆకాశంలో విమానం వెళుతుండగా...భూమికి దరిదాపుల్లో కూడా లేనప్పుడు దాని డోర్ ఊడిపోతే...అందులో 20 నిమిషాల పాటూ కూర్చోవలసి వస్తే...వామ్మో తలుచుకుంటేనే గుండెలు ఆగిపోతున్నాయి కదూ...కానీ పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన అలస్కా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ లో సరిగ్గా ఇదే జరిగింది.

16 వేల అడుగుల ఎత్తులో..

16వేలకు పైగా అడుగుల ఎత్తులో వెళుతున్న విమానం డోర్ భారీ శబ్దంతో ఊడిపోయి...ఎగిరిపోయింది. వెంటనే ఫ్లైట్‌ను దించలేని పరిస్థితి. విమానం దిగాలన్నా కూడా 20 నిమిషాలు రన్ చేయాల్సిందే. 20 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. చివరకు విమానాన్ని సురక్షితంగా బయలుదేరిన విమానాశ్రయంలో దింపడంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.

Also Read:నేను నరసరావుపేటలో అయితేనే పోటీ చేస్తా…లావు శ్రీకృష్ణదేవరాయలు

వైరల్ అవుతున్న వీడియో..

అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 ఏఎస్1282 విమానం పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే డోర్ తెరుచుకోవడంతో అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. క్యాబిన్ మధ్యలో ఉన్న తలుపు పూర్తిగా విమానం నుంచి విడిపోయినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన ప్రతీఒక్కరూ అమ్మ బాబోయ్ అని అని గుండెలు మీద చేతులు వేసుకుంటున్నారు...పై ప్రాణాలు పైకే పోతాయని అంటున్నారు.

విచారణ చేపట్టాం..

విమానంలో ప్రయాణించిన ప్రతీ ఒక్కరూ తనమకు పునర్జన్మ లభించిందని అనుకుంటున్నారు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడినందుకు విమాన సిబ్బందికి, కనిపించని దేవుళ్ళకు కృతజ్ఞలు చెబుతున్నారు. మరోవైపు ఏమి జరిగిందో మేము పరిశీలిస్తున్నాం.. కారణం తెలిసిన తర్వాత వివరిస్తాం...దానికి బాధ్యులు ఎవరనేది చెప్తామని అలస్కా ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు ట్విట్టర్‌లో వెల్లడించింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం 16,325 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత తిరిగి పోర్ట్‌లాండ్ విమానాశ్రయానికి వచ్చిందని ఫ్లైట్‌రాడార్24 తెలిపింది.

#flight #alaska-air-lines #mid-air #door
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe