ఒకప్పుడు వీధుల్లో నగలు అమ్మాడు.. ఇప్పుడు దేశంలోనే టాప్ హీరో!

అతడు దేశంలోని అగ్రకథనాయకులలో ఒకడు.జీవితం అంటే తెలిసిన వ్యక్తి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అతను వీధుల్లో నగలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రూ.150లకి పని చేసిన అతను ఇప్పుడు సినిమాకు 150కోట్లు తీసుకుంటున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరో చూసేద్దామా!

New Update
ఒకప్పుడు వీధుల్లో నగలు అమ్మాడు.. ఇప్పుడు దేశంలోనే టాప్ హీరో!

Bollywood Actor Akshay Kumar: సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. ఏళ్ల తరబడి కష్టపడ్డ కొందరు వ్యక్తులు మాత్రమే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీకి ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోలు వచ్చినా, కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందులోనూ టాప్ హీరోలుగా ఎదగడానికి అన్నీ కలిసిరావాలి. ఇప్పుడు సూపర్ స్టార్స్‌గా ఎదిగిన సీనియర్ యాక్టర్స్, కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు అనుభవించారు.అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఓ హీరో, ఒకప్పుడు వీధుల్లో నగలు అమ్మి డబ్బు సంపాదించాడు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ హీరోల్లో ఒకరిగా నిలుస్తున్నాడు. ఆ యాక్టర్ ఎవరో కాదు, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్.

publive-image

అద్భుత నటనతో ఎన్నో బ్లాక్‌బస్టర్లను అందించి విలాసవంతమైన జీవితం గడుపుతున్న అక్షయ్, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు. వివిధ నగరాల్లో కూలీగా పనిచేశాడు. వీధుల్లో గిల్ట్ నగలు అమ్మాడు. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. రూ.80 కోట్ల విలువైన విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్నాడు. ఆయన గ్యారేజీలో లగ్జరీ కార్లకు కొదవలేదు.

Also Read: జక్కన్న డైరెక్షన్ లో వార్నర్ యాక్టింగ్.. వీడియో చూస్తే నవ్వలేక చస్తారు!

అక్షయ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 15 ఏళ్ల వయసు నుంచి పని చేయడం ప్రారంభించినట్లు చెప్పాడు. ‘కలకత్తాలోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో హెల్పింగ్ బాయ్‌గా పని చేశాను. నా మొదటి జీతం రూ.150. బతుకుదెరువు కోసం ఎన్నో పనులు చేశాను. ఢిల్లీ వీధుల్లో నగలు అమ్మాను. ఆ తర్వాత ఢాకాకు వెళ్లాను. అక్కడ ఒక హోటల్‌లో పనిచేశాను. తర్వాత బ్యాంకాక్‌ వెళ్లాను. ఢిల్లీలో నగలు కొని ముంబైలో అమ్మేవాడిని. గిల్ట్ నగలను ఢిల్లీలో రూ.20,000కి కొనుగోలు చేసి, వాటిని ముంబైలో రూ.24,000 అమ్మాను.’ అని చెప్పాడు.

akshay

అక్షయ్ కుమార్ సినిమాల్లోకి రాకముందు అద్దె ఇంట్లో ఉండేవాడు. సినిమాల్లోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తర్వాత వరుస అవకాశాలతో సక్సెస్ అందుకున్నాడు. ఫిర్ హేరా ఫేరీ, భూల్ భులయ్యా, రౌడీ రాథోడ్, గరం మసాలా, హౌస్‌ఫుల్ వంటి హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. ఒకానొక దశలో అక్షయ్ హీరోగా ఏడాదికి 4 సినిమాలు వచ్చి హిట్టు కొట్టేవి. ఈ క్రమంలో దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు.

Akshay

అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు రూ.60 కోట్ల నుంచి రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అతని నికర సంపద రూ.2,500 కోట్లు. అక్షయ్ కో-యాక్ట్రెస్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షయ్ కుమార్‌కు రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ ఉంది. రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VII, రూ.4 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జిటి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియా చోటే మియా’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, అలయ ఎఫ్, మానుషి చిల్లర్ వంటి నటీనటులు ఈ మూవీలో నటించారు.

Advertisment
తాజా కథనాలు