lakshadweep : ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర ట్వీట్ల నుండి వివాదం తలెత్తిన 5 రోజుల్లో, లక్షద్వీప్‌కు వెళ్లే అన్ని విమానాలు మార్చి వరకు బుక్ అయ్యాయి. దేశంలోని మరో పర్యాటక ప్రదేశాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ (lakshadweep)ను సందర్శించడం గమనార్హం. ప్రధాని మోదీ లక్షద్వీప్ ఫొటోల కారణంగా ఇప్పుడు లక్షద్వీప్ హాట్ స్పాట్ గా మారింది. గూగుల్ సెర్చ్ లోనూ చాలా మంది దీని గురించే సెర్చ్ చేస్తున్నారట. అంతేకాదు అనేక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency)లు కూడా లక్షద్వీప్ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.
అలయన్స్ ఎయిర్ అనే ఒక విమానయాన సంస్థ మాత్రమే లక్షద్వీప్‌లో విమానాలను నడుపుతోంది. ఇది కేరళలోని కొచ్చి, లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపంలోని ఏకైక ఎయిర్‌స్ట్రిప్ మధ్య అన్ని విమానాలను నడుపుతుంది. కొచ్చి నుండి అగట్టికి విమాన సమయం సుమారు గంట ముప్పై నిమిషాలు. మీడియా నివేదిక ప్రకారం, ఈ కంపెనీ ప్రతిరోజూ కొచ్చి, లక్షద్వీప్ మధ్య 70 నుండి 72 సీట్ల ATR-72 విమానాలను నడుపుతోంది. మార్చి వరకు కొచ్చి-అగట్టి విమాన టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
అయితే లక్షద్వీప్ లో మౌలిక సదుపాయలు అంతంత మాత్రమే. కానీ ప్రధాని మోదీ పర్యటన తర్వాత అక్కడ రద్దీ వేగంగా పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పర్యాటకుల రాక పెరుగుతుండటంతో అక్కడ మౌలిక సదుపాయలను పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున టూరిస్టులు ఇప్పటికే లక్షద్వీప్ కు చేరుకుంటున్నారు. సౌకర్యాల లేమితో అక్కడి వాతావరణం గందరగోళంగా మారే అవకాశం కూడా ఉంది.
ఇదిలావుండగా, లక్షద్వీప్‌పై విపరీతమైన ఎంక్వైరీలు పెరుగుతున్నాయి.మాల్దీవులుట్రిప్ యొక్క ప్రస్తుత ప్రయాణీకులు ఇప్పటికే ప్యాకేజీ కోసం చెల్లించినందున వారి బుకింగ్‌లను రద్దు చేయడం లేదు. అయితే, లక్షద్వీప్‌కు అతిపెద్ద సమస్య పరిమిత సంఖ్యలో విమానాలు మాత్రమే కాదు. లక్షద్వీప్‌లో పరిమిత సంఖ్యలో రిసార్ట్‌లు కూడా ఉన్నాయి. వాటిని ముందుగానే బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. అయితే, ఇప్పుడు ప్రజలు మాల్దీవుల కంటే లక్షద్వీప్‌కు ప్యాకేజీలను డిమాండ్ చేస్తున్నారు. కానీ టూర్ ఆపరేటర్లు ఇప్పుడు వారికి వనరులు లేకపోవడం, లక్షద్వీప్‌కు వెళ్లడానికి అవసరమైన పేపర్‌వర్క్ గురించి చెప్పడంతో పర్యాటకులు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు.