Akkineni Nagarjuna : టబుతో నా రిలేషన్ అదే.. ఇది అమలకు కూడా తెలుసు..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పై గతంలో ఎన్నో రకాల రూమర్స్ వైరలయ్యాయి . అనుష్క, టబు తో నాగార్జున ప్రేమాయణం నడిపినట్లు కథనాలు వచ్చాయి. దీని పై కింగ్ నాగ్ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య అసలు ఏం జరిగిందో చెప్పారు. నాగార్జున కామెంట్స్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Akkineni Nagarjuna : టబుతో నా రిలేషన్ అదే.. ఇది అమలకు కూడా తెలుసు..!

Akkineni Nagarjuna - Tabu : టాలీవుడ్(Tollywood) మన్మధుడు కింగ్ నాగార్జున(King Nagarjuna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ నవ మన్మదుడిలా కనిపిస్తుంటారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. 35 ఏళ్ళైనా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్, పాట్రాయిటిక్.. ఇలా నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రికార్డులు, కలెక్షన్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా 'నా సామిరంగ'(Naa Saami Ranga) చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్(Family Action Entertainer) గా రూపొందిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది.

Also Read : Hero: తండ్రైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. పాప పేరు కూడా రివీల్..!

ఇది ఇలా ఉంటే నాగార్జున వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. గతంలో ఆయన పై ఎన్నో రూమర్స్ వైరలయ్యాయి. స్టార్ హీరోయిన్స్ అనుష్క, టబు(Tabu) తో నాగార్జున ప్రేమాయణం నడిపినట్లు రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదు. ఈ వార్తల పై ఓ ఇంటర్వ్యూ లో కూడా క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అసలు తమ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెప్పారు.

Akkineni Nagarjuna - Amala - Tabu

టబు, అనుష్కతో నాగార్జున రిలేషన్ ఇదే

ఇంటర్వ్యూ లో నాగార్జున ఇలా మాట్లాడారు.. టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. మా ఇంటి ముందున్న ఫ్లాట్ టబు, నా భార్య అమల ఇద్దరు కలిసి దగ్గరుండి కట్టించుకున్నారు. టబు సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తెలుసు. టబు నా బెస్ట్ కో ఆర్టిస్ట్.. నా ఫేవరేట్ హీరోయిన్ ఎవరంటే తన పేరే చెబుతాను. తాను మా కుటుంబ సభ్యురాలు.. అమ్మ, నాన్నకు కూడా టబు అంటే చాలా ఇష్టం. టబు చాలా ఎమోషనల్.. తనకు నేనొక సైకియార్టిక్ డాక్టర్. ఏదైనా బాధ కలిగితే నైట్ రెండింటికి కూడా నాకు ఫోన్ చేస్తుంది. హైదరాబాద్ వచ్చేయ్ అని చెప్తాను. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా గట్టిది.. గొప్పది. ఇక అనుష్క విషయంలో.. నేనే కాస్త హైట్ కదా.. అందుకే టాల్ హీరోయిన్స్ ను రికమెండ్ చేస్తాను. జోడీ బాగుంటుందని అనుష్కను తీసుకునేవాడిని అంతే. సమాజం పాడైపోతుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

Also Read : Balakrishna: గాలికి విగ్‌ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు