Naga Chaitanya Engagement: అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ నిశ్చితార్థం-live అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. By Archana 08 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naga Chaitanya Engagement: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నేడు ఉదయం 9.45 నిమిషాలకు కుటుంబ సభ్యులు అతి కొద్ది సన్నిహితుల మధ్య నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు. ఆ మధ్య నాగచైతన్య శోభితతో కలిసి విదేశీ ట్రిప్పులు, రెస్టారెంట్లకు వెళ్లిన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఈ వార్తలను నిజం చేస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు ఈ జంట. ఈరోజు ఉదయం వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సమంతతో విడాకులు ఇది ఇలా ఉంటే నాగ చైతన్యకు 2017లో టాలీవుడ్ నటి సమంతతో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. నాలుగేళ్లపాటు సమంత, చైతుల ప్రయాణం సాఫీగా సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2017లో ఈ జంట విడాకులు ప్రకటించింది. సమంతతో విడాకుల తర్వాత చైతు నటి శోభితతో ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇరు కుటుంబాలు ఓకే అనడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు చైతు , శోభిత. "We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!! We are overjoyed to welcome her into our family. Congratulations to the happy couple! Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024 #naga-chaitanya #sobhita-dhulipala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి