Akkineni Naga Chaitanya : మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతపై నాగార్జున ఇప్పటికే పలుమార్లు స్పందించారు. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని.. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు దీనిపై నాగ్..కోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతపై కోర్టు స్టే విధించింది.
కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా N - కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. తాజాగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను మీడియా ఈ విషయం ప్రశ్నించింది.
Also Read : ఆ ఒక్క రీజన్ తో పవన్ కళ్యాణ్ ‘ఖుషి 2’ స్టోరీ రిజెక్ట్ చేశారు : SJ సూర్య
ఇందుకు చైతూ స్పందిస్తూ..' ఆ విషయం ఇప్పుడు వద్దని.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాన్న ట్విట్టర్ వేదికగా అన్ని వివరాలు చెప్పారని' అన్నారు. డెస్టినేషన్ లేదా హైదరాబాద్ లోనే మీ పెళ్లి జరుగుతుందా? అని ప్రశ్నించగా..' ఇంకా ఏం నిర్ణయించలేదని అన్నారు. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో త్వరలోనే అందరికీ తెలుస్తాయని' అన్నారు. అలాగే మంచి కథ ఉంటే శోభిత, తాను కలిసి నటిస్తామని కూడా చెప్పాడు. దీంతో చై కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.