Akbaruddin Owaisi: సంతోష్ నగర్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోతుందని సీఐ శివ చంద్ర వారించగా. ఆయనపై కోపంతో ఊగిపోయారు ఓవైసీ. ఇంకా 5 నిమిషాలు సమయం ఉన్నప్పటికీ.. ముందే ఎలా వార్నింగ్ ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. తన వద్ద కూడా వాచ్ ఉందని, తనను ఆపే వ్యక్తి ఇంకా ఎవరూ పుట్టలేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడుతానని అన్నారు అక్బరుద్దీన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చాంద్రాయణగుట్టలో ప్రచారం చేశారు. అయితే, సమయం మించిపోవడంతో.. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ శివ చంద్ర ఆయన్ను వారించారు. సమయం ముగిసిపోతుందని, ఇక ప్రచారం ముగించాలని అన్నారు.
అయితే, తననే అడ్డుకుంటావా? అంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్బరుద్దీను. తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తాను సైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తి పోట్లు, బుల్లెట్ గాయాలు అయ్యాయని, తన పని అయిపోయిందని అనుకుంటున్నారేమో.. ఇంకా అదే ఆదేవశం.. అదే దమ్ము నాలో ఉందంటూ రెచ్చిపోయారు అక్బరుద్దీన్. 'పరుగులు పెట్టిద్దామా? నేను అలిసిపోయానని అనుకుంటున్నారు.. మన పని అయిపోయిందనుకుంటున్నారు. కానీ, వారికి మనమేంటో చూపించాలి. అక్బరుద్దీన్ ఓవైసీతో పోటీ చేయడానికి వస్తున్నారు. రానీయండి. వాళ్లు గెలుస్తారో.. మనం గెలుస్తామో చూద్దాం' అంటూ ప్రజలనుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు అక్బరుద్దీన్ ఒవైసీ.
Also Read:
కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..