Aaliyah Kashyap: ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
ఈ మేరకు 'అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉంది. నేను కూడా ఆ సర్కస్‌ను ఫాలో అవుతున్నా. నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.