Akasa Air : బోయింగ్ విమానాలకు భారీగా ఆర్డర్ చేసిన అకాసా ఎయిర్ లైన్స్ అంతర్జాతీయంగాప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే మార్గంలో అకాసా ఎయిర్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల బోయింగ్ నుంచి 150 నారోబాడీ విమానాలను తీసుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది. By KVD Varma 19 Jan 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Akasa Airlines : బడ్జెట్ ఎయిర్‌లైన్ అకాసా ఎయిర్(Akasa Air) తన దేశీయ-అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడానికి బోయింగ్ నుంచి 150 నారోబాడీ విమానాలను ఆర్డర్ చేసింది. ఆర్డర్‌లో 737 MAX 10 -737 MAX 8-200 జెట్‌ల మిక్స్ ఉంది. MAX 9 వెర్షన్ అకాసా ఆర్డర్‌లో ఉందా లేదా అనే వివరాలు చెప్పలేదు. ఇటీవల, అలాస్కా ఎయిర్‌లైన్స్(Alaska Airlines) లో క్యాబిన్ ప్యానెల్ బ్లోఅవుట్ సంఘటన తర్వాత, MAX 9 విమానాలను ఎయిర్‌లైన్ గ్రౌండింగ్ చేసింది. 30 ప్రముఖ ఎయిర్‌లైన్స్ రేసులో అకాసా ఈ భారీ-చారిత్రాత్మక ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్ ప్రపంచంలోని టాప్ 30 ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో అకాసాను(Akasa Air) ఒకటిగా మారుస్తుందని అకాసా ఎయిర్ వ్యవస్థాపకుడు -CEO వినయ్ దూబే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ దశాబ్దం ముగింపులోపు ఇది ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే మార్గంలో ఉంది. ఈ విమానాలను మా ఫ్లీట్‌కు చేర్చడం వల్ల మా కార్యాచరణ శక్తి పెరుగుతుంది. మేము మా అంతర్జాతీయ కార్యకలాపాలను త్వరలో ప్రారంభిస్తాము అని వినయ్ దూబే చెప్పారు. Also Read : నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది మొత్తం ఆర్డర్ 226 విమానాలు.. 2021లో, అకాసా ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ప్రారంభ ఆర్డర్‌తో తన విమానాల కొనుగోలును ప్రారంభించింది. తరువాత, జూన్ 2023లో, ఎయిర్‌లైన్ 4 బోయింగ్ 737 MAX 8 విమానాల అదనపు ఆర్డర్‌తో దాని విమానాలను విస్తరించింది. జనవరి 2024లో తాజా ఒప్పందంతో, Akasa Air మొత్తం ఆర్డర్ ఇప్పుడు 226 విమానాలకు చేరుకుంది. Akasa 22 విమానాల సముదాయాన్ని నిర్వహిస్తోంది ప్రస్తుతం, Akasa Air ఎయిర్‌లైన్ 22 విమానాల సముదాయాన్ని నిర్వహిస్తోంది-మొత్తం 204 విమానాలను రాబోయే ఎనిమిదేళ్లలో తీసుకునే విధంగా షెడ్యూల్ చేశారు. ఎయిర్‌లైన్ తన మొదటి వాణిజ్య విమానాన్ని ముంబై నుంచి అహ్మదాబాద్‌కు 07 ఆగస్టు 2022న ప్రారంభించింది. Watch this interesting Video : #airlines #boeing-737-max #akasa-airlines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి