Ajith : హైదరాబాద్ రోడ్లపై బైక్ నడిపిన కోలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్!

'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్.. షూటింగ్ విరామ సమయంలో తన బైక్ పై సరదాగా రైడ్ కి వెళ్ళాడు. సోమవారం సాయంత్రం ఆయన తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Ajith : హైదరాబాద్ రోడ్లపై బైక్ నడిపిన కోలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్!
New Update

Tamil Actor Ajith Bike Riding In Hyderabad : కోలీవుడ్ (Kollywood) స్టార్ అజిత్ కి బైక్ రైడింగ్ (Bike Riding) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయనకు బైక్స్ అన్నా, బైక్ రేసింగ్ అన్నా పిచ్చి. బైక్ రేసింగ్ పై ఉన్న పిచ్చితో అనేక రేసుల్లో పాల్గొని ఇంటర్నేషనల్ బైక్ రేసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక షూటింగ్స్ లేని టైం లో సరదాగా తన ఫేవరేట్ బైక్ పై అలా చక్కర్లు కొడుతుంటాడు ఏ తమిళ హీరో. ఈ క్రమంలోనే అజిత్ తాజాగా హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read : ‘కల్కి’ ప్రమోషన్స్ కి భారీ ఏర్పాట్లు.. వచ్చే నెల నుంచి వరుస సర్ప్రైజ్ లు, ఫ్యాన్స్ కి పండగే!

హైదరాబాద్ రోడ్లపై అజిత్ బైక్ రైడింగ్

అజిత్ (Ajith) హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్.. షూటింగ్ విరామ సమయంలో తన బైక్ పై సరదాగా రైడ్ కి వెళ్ళాడు. సోమవారం సాయంత్రం ఆయన తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అజిత్ బైక్ రైడింగ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో ఉండబోతుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

#tamil-actor-ajith #ajith-bike-riding-in-hyderabad #kollywood
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి