Recharge Plans: ఎయిర్ టెల్- జియో బంపర్ ప్లాన్స్...ఫ్యామిలీ మొత్తానికి డేటా, కాలింగ్..!!

ఈ ప్లాన్స్ లో గరిష్టంగా 200జిబి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.

Recharge Plans: ఎయిర్ టెల్- జియో బంపర్ ప్లాన్స్...ఫ్యామిలీ మొత్తానికి డేటా, కాలింగ్..!!
New Update

Recharge Plans:  ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. పలు టెలికాం కంపెనీలు తమ వినియోగదారులను తమ వైపు మళ్లించుకునేందుకు కొత్త కస్టమర్లను చేరుకునేందుకు ఒకటి తర్వాత ఒకటి కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. దీంతో పలు రకాల ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. జియో , ఎయిర్ టెల్ ధమాకా ఫ్యామిలీ(Jio, Airtel Dhamaka family) పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను తీసుకువచ్చాయి. జియో, ఎయిర్ టెల్ అందించిన ఈ అద్భుతమైన ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నెలవారీ మొబైల్ రీఛార్జీ బిల్లులను చెల్లించే వ్యక్తులు జియో, ఎయిర్ టెల్ ఫ్యామిలీ పోస్టు పెయిడ్ ఫ్లాన్స్ తీసుకోవచ్చు. ఎవరైనా రీఛార్స్ ప్లాన్ తో ఓటీటీ యాప్స్ ఫ్రీ ఛానెల్స్ ను ఆస్వాదించాలనుకుంటే వారికి ఈ ప్లాన్స్ తో బెస్ట్ ఛాయిస్ ఉంది. జియో ఎయిర్ టెల్ వంటి రెండు కంపెనీలు గొప్ప పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. ఎవరైనా జియో, ఎయిర్ టెల్ కస్టమర్లు అయితే వేర్వేరు ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు రీచార్జ్ ప్లాన్స్ తీసుకుంటే వారి నెలవారీ రీఛార్జ్ ప్లాన్స్ కు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఆవిధంగా కాకుండా జియో, ఎయిర్ టెల్ ఫ్యామిలీ పోస్టు పెయిడ్ ఫ్లాన్స్ తీసుకోవచ్చు. ఇవి నెలవారీ మొబైల్ రీఛార్జ్ ను తగ్గిస్తాయి.

ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది అసలు సిమ్ కి 3 ఫ్యామిలీ సిమ్ లను అందిస్తుంది. ఒక్కో సిమ్ కు ప్రత్యేకంగా 99చెల్లించాలి. ఈ ప్లాన్ లో 75జీబీ డేటా లభిస్తుంది. ఒక్కో సిమ్ పై 5జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కోసం వన్ టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ రూ. 500చెల్లించాలి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి 70000కి మిస్డ్ కాల్ చేస్తే జియో ప్లస్ సర్వీస్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ పెయిడ్ సిమ్ ను ఫ్రీగా హోండెలివరీ కోసం అభ్యర్థనను రిక్వెస్ట్ చేయండి. మీ కుటుంబంలోని ముగ్గురు సభ్యులను సిమ్ పొందే అవకాశం ఉంటుంది.

ఈ ప్లాన్ లో 200జిబి వరకు డేటా రోల్ ఓవర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ లో కస్టమర్లు రోజుకు 100 ఎస్ ఎంఎస్ ల ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్ ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ స్క్రిప్షన్ తో వస్తుంది.

ఇది కూడా చదవండి: బీఈడీ, డీఈడీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్..!!

#recharge-plans #airtel #jio
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి