Latest Jobs : ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎయిర్‌పోర్ట్ అథారిటీలో జాబ్స్!

490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మే 1. దరఖాస్తు రుసుము రూ. 300. అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.

New Update
SSC : నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదల!

AAI Jobs : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) లో పని చేయాలనుకునే యువతకు ఇదే మంచి అవకాశం. అనేక ఖాళీ పోస్టుల కోసం AAI రిక్రూట్‌మెంట్‌(AAI Recruitment) ను విడుదల చేసింది. కాసేపటి క్రితమే అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తుకు అర్హతలు:

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని వివిధ శాఖలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల(Junior Executive Posts) కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ డిగ్రీని కలిగి ఉండాలి. దీంతో పాటు దరఖాస్తుదారు తప్పనిసరిగా గేట్-2024 పరీక్ష(GATE-2024 Exam) కు హాజరై ఉండాలి.

ఖాళీల సంఖ్య:

--> జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 3
--> జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్) - 90
--> జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్)-106
--> జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) – 278
--> జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-13

వయో పరిమితి:
--> అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. SC/STలకు ఐదేళ్లు, OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్లు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
--> దరఖాస్తు రుసుము రూ. 300.
AAI/మహిళా అభ్యర్థులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన SC/ST/PWBD అభ్యర్థులు/ట్రైనీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

--> aai.aero అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

--> హోమ్‌పేజీలో, AAI రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

--> కొత్త విండో ఓపెన్ అవుతుంది.

--> మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

--> జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్‌ చేయండి.

--> అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

--> దరఖాస్తు రుసుమును చెల్లించండి.

Also Read : వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ

Advertisment
తాజా కథనాలు