Air India : టెల్‌ అవీవ్‌ కు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు..ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం!

ఇజ్రాయెల్‌ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ ముఖ్య నగరమైన టెల్‌ అవీవ్‌ కు ఎయిర్‌ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది

New Update
Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త!

Air India Flights Cancel : ఇజ్రాయెల్‌(Israel), ఇరాన్(Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ ముఖ్య నగరమైన టెల్‌ అవీవ్‌ కు ఎయిర్‌ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి ఎయిర్‌ ఇండియా ఈ విషయం గురించి స్వయంగా ప్రకటించింది.

ఢిల్లీ నుంచి టెల్‌ అవీవ్‌ కు డైరెక్ట్‌ విమాన సర్వీసులు నడుస్తాయి. వాటిని ఇప్పుడు రద్దు చేసినట్లు తెలిపింది. ఈ రెండు నగరాల మధ్య ఎయిర్‌ ఇండియా వారానికి 4 సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మార్చి 3 నుంచి ఈ విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి.

గతేడాది అక్టోబర్ లో హమాస్ ఉగ్రవాదులు(Hamas Terrorists) టెల్అవీవ్‌(Tel Aviv) లో నరమేధం సృష్టించడం, అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడికి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్లీ మార్చి నుంచే సర్వీసులను నడుపుతుంది.

కాగా శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. 200లకుపైగా డ్రోన్లు, డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

Also read: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు