AICTE: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 50 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కొందరు విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ పథకాలను తీసుకువచ్చింది. దీని ద్వారా వారికి ఏడాదికి రూ. 50 వేలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? అర్హతలేంటి? లాస్ట్ డేట్‌ ఎప్పుడు అనే సమాచారం కోసం https://aicte-india.org/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

AICTE: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 50 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
New Update

AICTE Scholarship: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) రెండు కొత్త స్కాలర్‌షిప్ పథకాలను తీసుకువచ్చింది. దీని సహాయంతో పేద విద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరకాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023గా ప్రకటించారు. ఈ స్కాలర్‌షిప్‌లు ముఖ్యంగా బాలికలు, వికలాంగ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఈ అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఎంపిక ఎలా జరుగుతుంది, అర్హతలు ఏమిటి, వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

AICTE ప్రగతి స్కాలర్‌షిప్ 2023..

ఈ స్కాలర్‌షిప్ బాలికల కోసం తీసుకురావడం జరిగింది. దీని కింద సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఎంపికైన విద్యార్థులకు గరిష్టంగా మూడేళ్లపాటు ఏడాదికి రూ.50 వేలు స్కాలర్‌షిప్ లభిస్తుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు మూడు సంవత్సరాలు, రెండవ సంవత్సరం విద్యార్థులు (లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందినవారు) రెండు సంవత్సరాల పాటు ఈ సదుపాయాన్ని పొందుతారు.

దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి ఒక అమ్మాయి అయి ఉండి, AICTE ఆమోదించిన ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి సమయం డిప్లొమా లేదా డిగ్రీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొంది ఉండాలి. ఇక అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023.

సక్షం స్కాలర్‌షిప్ 2023..

ఈ స్కాలర్‌షిప్ ప్రత్యేకించి వికలాంగ అభ్యర్థుల కోసం. టెక్నికల్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు ఏటా రూ.50 వేలు అందజేస్తారు. ఇందులో కూడా కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలి. అభ్యర్థి మొదటి లేదా రెండవ సంవత్సరం విద్యార్థి అయినా వారికి వర్తిస్తుంది. అభ్యర్థి వైకల్యం 40 శాతానికి తగ్గకుండా ఉండాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023.

కాగా, ఈ రెండు స్కాలర్‌షిప్‌లకు అర్హత పరీక్ష ద్వారా ఉంటుంది. ఈ రెండు స్కాలర్‌షిప్‌లకు వివరాలను తెలుసుకోవడానికి, దరఖాస్తు చేయడానికి, అధికారిక వెబ్‌సైట్‌(https://aicte-india.org/)ను సందర్శించవచ్చు.

Also Read:

అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..

#aicte #scholarship-2023 #aicte-scholarship-2023 #students-scholarship
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe