Scholarship: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఎల్ఐసీ నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు ఇలా..!!
పదోతరగతి పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త. ఉన్నత చదువుల కోసం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ. 30వేల స్కాలర్ షిప్ ను పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థుల నుంచి విద్యాదాన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యావిదాన్ స్కాలర్ షిప్స్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా తమ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవచ్చు.