OLA AI: మేడ్‌ ఇన్‌ ఇండియా 'ఏఐ'! తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కంటెంట్‌!

కంటెంట్‌ను తెలుగుతో పాటు 20 భారతీయ భాషల్లో క్రియేట్‌ చేసి ఇండియా ఆధారిత 'ఏఐ' అప్లికేషన్‌ వచ్చె నెల(జనవరి) నుంచి అందుబాటులోకి రానుంది. Krutrim అని పేరు పెట్టిన ఈ మోడల్‌ను 'ఓలా' రూపొందించింది.

OLA AI: మేడ్‌ ఇన్‌ ఇండియా 'ఏఐ'! తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కంటెంట్‌!
New Update

ఎక్కువ ఆలోచించండి కానీ ఎక్కువ ఆవేశ పడొద్దు.. హర్డ్‌వర్క్‌ నాలెజ్డ్‌ పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు..అదే స్మార్ట్‌ వర్క్‌ని పనిలోనే ఉపయోగిచుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ మాయలో పరుగులు తీస్తోంది. స్కూల్‌ పిల్లలు, కాలేజీ విద్యార్థులు, కంటెంట్‌ రైటర్ల నుంచి టెక్కీల వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది 'ఏఐ(AI)'పై డిపెండ్‌ అవుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఏఐని ఎక్కువగా యూజ్‌ చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. నెట్టింట్లో అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అప్లికేషన్స్‌ ఉన్నా 'ఓపెన్‌ ఏఐ(Open AI)' ఎక్కువగా ఫేమస్‌ అయ్యింది. ఇది అమెరికా బెసెడ్‌ అప్లికేషన్‌. అయితే ఇండియా కూడా త్వరలోనే ఇలాంటి అప్లికేషన్‌నే తీసుకురానుంది.


ఓలా నుంచి ఏఐ:
ఇప్పటికే అనేక రంగాల్లో దూకుడు కనబరుస్తున్న ఓలా తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీల్డ్‌లోనూ అడుగుపెట్టింది. ఓలా CEO భవిష్ అగర్వాల్ 'Krutrim(కృత్రిమ్)' అనే ఏఐ మోడల్‌ని తాజాగా లాంచ్‌ చేశారు. భారతదేశపు మొదటి పూర్తి స్టాక్ ఏఐ ఇదే. భారతీయ భాషలు, ఇండియాకు సంబంధించిన డేటాపై ఆధారంగా Krutrimను డిజైన్ చేశారు.

తెలుగుతో పాటు 20భాషల్లో కంటెంట్:
Krutrim మోడల్ రెండు ట్రిలియన్ టోకెన్‌లపై శిక్షణ పొందింది. ఇందులో సంభాషణలు, డేటాసెట్‌లలో ఉపయోగించే పదాలు ఉంటాయి. ఈ మోడల్ 20 భారతీయ భాషలను అర్థం చేసుకుంటుంది. మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడ, ఒరియాతో సహా 10 భారతీయ భాషలలో కంటెంట్‌ను రూపొందించగలదు. ఓపెన్‌ ఏఐ(OpenAI) GPT-4 కంటే కూడా Krutrim పెద్ద ఇండిక్ లాంగ్వేజ్ సపోర్ట్‌ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ LLM భాషలు, స్క్రిప్ట్‌లను అర్థం చేసుకోవడానికి అనుకూల టోకెనైజర్‌ని ఉపయోగిస్తుంది. వచ్చే నెలలో(2024-జనవరి) ఈ Krutrim అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్‌ వార్‌? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్‌!

WATCH:

#ai #artificial-intelligence #ola #krutrim
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe