How To Use Meta AI on WhatsApp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ వాట్సాప్ దూసుకుపోతోంది. దీనిలో నెలకు ఒకటైనా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతుంది మెటా. కొత్త టెక్సాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్‌లోకి ఏఐ చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది మెటా. తొందరలోనే ఈ ఏఐ ఆప్షన్‌ను భారతదేశంతో సహా మరికొన్ని దేశాల్లో దీన్ని ప్రారంభిస్తోంది మెటా. ఇందులో ఇంగ్లీష్ కూడా మాట్లాడొచ్చు. కానీ, వాట్సాప్ ఎఐ చాట్‌బాట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడదు.
Also Read: 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా
వాట్సాప్‌లో ఇప్పటివరకు చాట్స్ అంతా ఎన్‌క్రిప్ట్ చేయబడుతోంది. కానీ ఏఐతో చేసే చాట్‌ను అలా చేయరు. ఎందుకంటే మెటా ఏఐ చాట్‌బాట్‌తో చేసే చాట్‌ను పరిశీలించాలనుకుంటోంది. దీని ద్వారా ఈ ఆప్షన్‌లో ఉన్న లోపాలను తెలుసుకోవాలని అనుకుంటోంది. దాని ద్వారా యాప్‌ను మరింత ముందుకు తీసుకెళ్ళొచ్చని భావిస్తోంది మెటా. ఓపెన్ ఏఐ, చాట్‌బాట్, గూగుల్ జెమిని లాంటి వాటని మెటా అందిస్తోంది. ఇందులో చాట్ చేసుకోవడంతో పాటూ ఫోటోలను కూడా క్రియేట్ చేసుకోవచ్చును. అయితే ఏఐను వినియోగించుకోవాలంటే వాట్సాప్ కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్ యాప్ అప్‌డేట్ చేసిన తర్వాత..వాట్సాప్ చాట్ పైన బ్లూ, పర్పుల్ ఐకాన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ ఫీచర్ యాక్సెస్ పొందొచ్చు. IOS యూజర్ల కోసం, ఆప్షన్‌ని కెమెరా పక్కన యాప్‌లో కుడివైపున కనిపిస్తోంది.
వాట్సాప్‌లో ఎఐ చాట్‌బాట్‌ను ఎలా ఉపయోగించాలంటే..
-- ముందుగా ఏఐని ఉపయోగించాలనుకుంటున్న చాట్ లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి.తర్వాత మెసెజ్ బాక్సులోకి వెళ్లి @Meta Ai అని టైప్ చేయాలి.ఎఐ ఆప్షన్ కనిపిస్తే, నిబంధనలను చదివి అంగీకరించాలి. తురవాత అందులో ఆప్షన్లను బట్టి ఫోటో, చాట్‌లను చేసుకోవచ్చును.