Fintech Companies : పేటీఎం బాటలో మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలు?

పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ఫిన్‌టెక్ కంపెనీల పనితీరును ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుడు పేటీఎం బాటలోనే నిబంధనల విషయంలో ఉదాశీనంగా ఉన్న కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలపై చర్యలు తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

New Update
Fintech Companies : పేటీఎం బాటలో మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలు?

Fintech Companies Radar : ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) Paytm పేమెంట్ బ్యాంక్‌పై నిషేధం విధించిన తర్వాత, ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు కూడా రాడార్‌పైకి వచ్చాయి. ఆర్బీఐ సోర్సెస్ ను ఉటంకిస్తూ నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అనేక ఫిన్‌టెక్ కంపెనీలు KYC డిఫాల్ట్‌లపై నియంత్రణ చర్యను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిలో చెల్లింపు అగ్రిగేటర్స్ అలాగే వాలెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు ఉండవచ్చు. అన్‌సెక్యూర్డ్ లోన్ మార్కెట్‌లో పనిచేస్తున్న కస్టమర్‌లు - లెండర్స్ మధ్య మీడియేటర్స్ గా వ్యవహరించే అనేక ఫిన్‌టెక్ కంపెనీలు(Fintech Companies) ఆర్బీఐ విచారణలో ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 31న, KYC ప్రక్రియలో యాక్సప్టెన్స్ లోపాలకు సంబంధించి Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI తీవ్ర ఆంక్షలు విధించింది. ఇలాంటి లోపాల కోసం ఇప్పటికే నిఘాలో ఉన్న కనీసం నాలుగు పేమెంట్ కంపెనీలు ఇప్పుడు వరుసలో ఉన్నాయని అంటున్నారు. 

రూల్స్ బలంగా లేవు..
RBI ప్రకారం, సాంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే ఫిన్‌టెక్ కంపెనీల KYC నియమాలు తగినంత బలంగా లేవు. రెగ్యులేటర్ ప్రకారం, గ్లోబల్ FATF ప్రమాణాలకు అనుగుణంగా కస్టమర్ ఫండ్‌లను ధృవీకరించడానికి బలమైన వ్యవస్థలు ఉండాలి. KYC సమస్యలు - ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా మోసాలను నిరోధించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశ్రమలో పాల్గొనేవారితో అనేకసార్లు సమావేశం అయి తీసుకోవాల్సిన చర్యల గురించి చెబుతూ వచ్చింది. 

Also Read : అబ్బా.. షాట్ వీడియోస్ చేయడం ఇంత ఈజీనా?

మనీలాండరింగ్‌ను అరికట్టడం కోసం..
RBI బ్యాంకింగ్ రంగానికి నియంత్రణ సంస్థ. కాబట్టి నిబంధనలను పర్యవేక్షించడం దాని బాధ్యత. మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేసే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా ఉంది. ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(FIU), పన్ను శాఖ కూడా మనీలాండరింగ్‌పై నిఘా ఉంచింది. ఇది కాకుండా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి నియంత్రణ సంస్థలు కూడా దీనిని నిర్ధారిస్తాయి.

Watch this Interesting Video :

Advertisment
తాజా కథనాలు