చైనా ఎప్పుడూ తన పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మొదట సహాయం పేరుతో అప్పు ఇచ్చి, ఆ తర్వాత తన బలగాలను వారి ప్రాంతంలో మోహరించడం తర్వాత బేస్ తయారు చేయడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా చైనా పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌లను అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేసింది. అయితే ఇప్పుడు తజికిస్థాన్‌ను బలిపశువుగా మార్చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) పేరుతో చైనా తజికిస్థాన్‌కు భారీ రుణం ఇచ్చి, భద్రతా ఒప్పందంపై సంతకం చేసి, దాని ద్వారా డ్రాగన్ తజికిస్తాన్‌లో రహస్య స్థావరాన్ని నిర్మిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇది భారతదేశానికి పెద్ద ముప్పు ఎందుకంటే ఈ రహస్య స్థావరం POK కి చాలా దగ్గరగా ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రాగన్ బిఆర్‌ఐ పేరుతో తజికిస్థాన్‌కు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వమని పదే పదే ఒత్తిడి తెస్తుంది. ప్రస్తుతం, తజికిస్థాన్ డబ్బును తిరిగి చెల్లించలేకపోతుంది. దీనిని ఆసరాగా తీసుకుని చైనా ప్రయోజనం పొందుతోంది. తజికిస్థాన్‌లోని తూర్పు గోర్నో బదక్షన్ ప్రాంతంలో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని 2019లో వెల్లడైంది. అయితే, చైనా లేదా తజికిస్థాన్ దీనికి సంబంధించిన తదుపరి సమాచారాన్ని బయటకు చెప్పలేదు. చైనా ఇక్కడ పూర్తి రహస్య స్థావరాన్ని నిర్మించుకున్నట్లు ఇటీవల కొన్ని ఉపగ్రహ చిత్రాలు వైరల్‌గా మారాయి. అయితే ఆ నివేదికను చైనా తోసిపుచ్చింది. కానీ చిత్రాల్లో మాత్రం చైనా కుట్ర బయటకు తీసింది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2023 అక్టోబర్‌లో పొరుగు దేశాలను హెచ్చరించారు. చైనా హిడెన్ ఎజెండా గురించి చెబుతూ.. ప్రమాదానికి దూరంగా ఉండాలని ఆయా దేశాలకు తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు డ్రాగన్ వలలో ఎలా చిక్కుకుపోయాయో వివరించారు. మాల్దీవులు కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పుడు తజికిస్తాన్ బలిపశువుగా మారుతోంది. అక్టోబరు 2021లో, తజికిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బదక్షన్ ప్రాంతంలో మరో చైనా స్థావరాన్ని నిర్మించేందుకు అక్కడి పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు కొత్త రహస్య స్థావరం వెలుగులోకి వచ్చింది. తజకిస్థాన్‌ను మోసం చేసి చైనా ఈ భూమిని లాక్కుందని జై శంకర్ ఆరోపించారు.
తజికిస్తాన్ ఎలా ఇబ్బందుల్లో పడుతోంది?
- చైనా, తజికిస్తాన్ మధ్య 477 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది.
- తజికిస్థాన్‌కు చైనా మందుగుండు సామగ్రి, సాంకేతికతను అందిస్తోంది.
- చైనా విధానాన్ని అనుసరించినప్పటికీ, తజికిస్తాన్ తన దేశంలో హిజాబ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది.
- చైనా ఆదేశాల మేరకు, తజికిస్తాన్ ల వందలాది మసీదులు మూసివేసింది. ఇమామ్‌లు ఇచ్చే బోధనలు అక్కడ నిషేధించాయి.
- మైనర్లను ప్రార్థనా స్థలాలలోకి అనుమతి లేకుండా చట్టం తెచ్చారు.
- 2006లో, తాజిక్ ప్రభుత్వం చైనా నుండి తన మొదటి ప్రధాన రుణాన్ని పొందింది. ఇక్కడ నుండి చైనీస్ కంపెనీలు రూట్ తీసుకోవడం ప్రారంభించాయి.
- ప్రస్తుతం తజికిస్థాన్‌లో 600కు పైగా చైనా కంపెనీలు పనిచేస్తున్నాయి. వీరిలో చాలా మంది సైనిక రంగంలో పనిచేస్తున్నారు.
- చైనా తన సొంత డబ్బుతో తజికిస్థాన్‌లో రాష్ట్రపతి భవన్‌ను, అమెరికా క్యాపిటల్ హిల్ వంటి పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది.
- చైనీస్ కంపెనీలు మాత్రమే పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు, నిర్మాణ ఒప్పందాలు మరియు మైనింగ్ పని చేస్తున్నాయి.