Telangana Elections 2023:నవంబర్ 23 తర్వాత ప్రచార హోరుతో దద్దరిల్లనున్న తెలంగాణ ఈ నెల 23 తర్వాత తెలంగాణలో హోరెత్తిపోనుంది. అప్పటికి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి అయిపోయి తెలంగాణలో ప్రచారం ఊపందుకుంటుంది. ఇక్కడ కూడా ప్రచారానికి చివరి వారం అవడంతో నాయకులందరూ పోటెత్తుతున్నారు. By Manogna alamuru 21 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి నవంబర్ 23 తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రచారంతో అదిరిపోనుంది. వారం రోజుల పాటూ దేశ నాయకులంతా ఇక్కడికే తరలి రానున్నారు. ప్రధాన మోదీ నుంచి జనేసే అధినేత పవన్ కల్యాణ్ వరకూ అందరూ ఇక్కడే ఉండనున్నారు. 23వ తేదీకి మిగతా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ అయిపోతుంది....ఒక్క తెలంగాణలో తప్ప. ఇక్కడ నవంబర్ 30న పోలింగ్. అంటే అప్పటికి ఇంకా వారం రోజులే మిగిలి ఉంటుంది. 28వ తేదీతో ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేయాలి. కాబట్టి ఆ ఐదు రోజుల్లో తెలంగాణను ప్రచారంతో హోరెత్తించేయాలి అని డిసైడ్ అయిపోయాయి అన్ని పార్టీలు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మీద ముందు నుంచే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు దీన్ని మరింత ఎక్కువ చేయాలని భావిస్తున్నాయి. అధికార పార్టీ తరుఫు నుంచి కేసీఆర్, కేటీఆర్...ఇతర నాయకులు ఆల్రెడీ సుడిగాలి పర్యటనలు చేస్తూ భీభత్సంగా ప్రచారం చేస్తున్నారు. అవతలి వైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఏమీ తక్కువ తినడం లేదు. ఇప్పటికే ప్రధాన మోదీ, రాహుల్ గాంధీతో సహా పెద్ద పెద్ద నేతలంతా రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. ఇప్పుడు పోలింగ్ కు ముందు 5 రోజులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. అది కూడా ఏదో ఒక్క సభకు రావడం వెళ్ళిపోవడం కాకుండా...ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొననున్నారు. బహిరంగసభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. Also read:కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు.. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25,26,27 తేదీల్లో మూడు రోజులూ తెలంగాణలోనే ఉండనున్నారు. ఇక్కడ తిరుగుతూ పూర్త ఇస్థాయిలో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 24,26,28 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మూడు రోజులు ప్రచారంలో పాల్గొంటారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వశర్మ, సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరుపు నుంచి రాహుల్, ప్రియాంక నవంబర్ 24 నుంచి 28 వరకు ఇక్కడే ఉండే వరుస సభల్లో పాల్గొననున్నారు. దాదాపు 20 వరకు సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పది నియోజకవర్గాలను పర్యటిస్తారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండి 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు,నాలుగు రోజులు వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. ఇక ఇతర ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాషిణి అలీ, విజయరాఘవన్ మరికొందరు 25, 26, 27 తేదీల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొననున్నారు. అలాగే జనసేన, బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రేపటి నుంచి ప్రచార బరిలోకి దిగనున్నారు. 28 వరకు సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధుల నియోజకవర్గాలు అయిన వరంగల్ వెస్ట్, కొత్త గూడెం, సూర్యపేట, దుబ్బాక, తాండూరులలో ఆయన ప్రచారం నిర్వహిస్తారు.26న మాత్రం కూకట్ పల్లిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. #telangana-elections-2023 #leaders #campaigning #parties మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి