Rohit Sharma Somnath: రోహిత్‌ శర్మ, ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్‌ ఏంటో తెలుసా?

తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే విక్టరీ గ్యారెంటీనా? ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ చర్చే జరుగుతోంది. ఇస్రో చీఫ్‌ సోమనాధ్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఇద్దరూ వెంకన్నని దర్శించుకున్న తర్వాత అద్భుత ప్రదర్శన చేశారని నెటిజన్లు అంటున్నారు. 2019 ప్రపంచకప్‌కి ముందు రోహిత్‌ తిరమలకు వచ్చాడని.. ఆ టోర్నిలో 5 సెంచరీలు బాదాడని.. ఇటు ఇస్రో చీఫ్‌ కూడా శ్రీవారి ఆశీర్వాదం తర్వాత చంద్రయాన్‌-3 సక్సెస్‌ని పొందారని అంటున్నారు.

New Update
Rohit Sharma Somnath: రోహిత్‌ శర్మ, ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్‌ ఏంటో తెలుసా?

Rohit Sharma and Somnath: జాబిల్లిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సక్సెస్‌ గురించి రోజులు గడుస్తున్నా సోషల్‌మీడియాలో చర్చ మాత్రం ఆగడంలేదు. ఇక ల్యాండర్‌ నుంచి దిగిన రోవర్‌ పరుగులు పెడుతోంది.. చంద్రుడిపై రహస్యాలను తెలుసుకుంటూ ఫొటోలు పంపుతోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయం వెనుక అనేక మంది పాత్ర ఉండగా.. ఈ సక్సెస్‌లో ప్రధాన రోల్‌ మాత్రం ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌దే. ప్రయోగాన్ని ముందుండి నడిపించారు సోమనాథ్‌. అన్నితానై చూసుకున్నారు. అందుకే ఫస్ట్ క్రెడిట్ ఆయనకే దక్కింది. అటు ఇంటర్‌నెట్‌ ప్రపంచం మొత్తం చంద్రయాన్‌ న్యూస్‌తో నిండిపోయి ఉండగా.. సోషల్‌మీడియాలో భారతీయులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్‌ శర్మకి ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కి ఉన్న ఓ కనెక్షన్‌ గురించి తెగ చర్చ జరుగుతోంది.

తిరుమల వెంకన్న లింక్:
ఏదైనా పని చేసేముందు చాలా మంది దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారు. వీరిలో స్కూల్‌ విద్యార్థుల నుంచి దేశాన్ని నడిపించే నాయకులు ఉంటారు. అటు డాక్టర్లు, సైంటిస్టులు, క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ప్రయోగానికి ముందు దేవుడి గుడిని దర్శించుకుంటారు. అందులోనూ తిరుమల శ్రీవారిని (Tirumala Temple) ఎక్కువగా దర్శించుకుంటారు. చంద్రయాన-3 ప్రయోగానికి ముందు సోమనాథ్‌ (Somanath)కూడా అదే చేశారు. వెంకన్నను దర్శించుకున్నారు. ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్న హైలెట్ చేస్తూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు.

రోహిత్‌ శర్మ కూడా అలానే చేశాడుగా:
2019 ప్రపంచ కప్‌కి ముందు రోహిత్‌ శర్మ తన భార్య రితికతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆ టోర్నిలో రోహిత్‌ అరవీర భయాంకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ ఆట చూసి ప్రపంచ క్రికెట్‌ అభిమానులు అతనికి జేజేలు పలికారు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 647 పరుగులు చేశాడు హిట్‌మ్యాన్‌. సగటు 107.83. స్ట్రైక్ రేట్ 98.9గా ఉంది. ఏకంగా ఒక్క ప్రపంచకప్‌లోనే రోహిత్ శర్మ 5 సెంచరీలు చేశాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇక్కడ కూడా అంతే.. మరి నెక్ట్స్‌ ఏంటి?
ఇస్రో చీఫ్ సోమనాథ్ కూడా చంద్రయాన్ ప్రయోగానికి ఒక రోజు ముందు తన బృందంతో తిరుపతి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత సోమనాథ్ బృందం చేసిన అద్భుతమైన ప్రయోగం గురించి ప్రపంచం ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంది. రోహిత్ శర్మ, సోమనాథ్ ఇద్దరూ తిరుపతి ఆలయంలో పూజలు చేశారు. ఇక ఈ వరల్డ్‌కప్‌కి ముందు కూడా హిట్‌మ్యాన్‌ తిరుమల వెంకన్నని దర్శించుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియాకు అతడే కెప్టెన్‌.. ఇటు సోమనాథ్‌ కూడా ఇస్రో టీమ్‌కి లీడర్‌.. చంద్రయాన్ సక్సెస్‌ లాగానే టీమిండియా ఈసారి వరల్డ్‌కప్‌ కొడుతుందని ఫ్యాన్స్‌ లాజిక్‌లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్ని అభిమానులు అనుకుంటున్న మాటలేనని గమనించగలరు.

ALSO READ: చంద్రయాన్‌-3 బాడీ పెయింటింగ్‌ ఫొటోలు వైరల్‌.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!

Advertisment
తాజా కథనాలు