కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా కెహెచ్ 234 సినిమాను నిర్మిస్తున్నాయి. 1987లో నాయకుడు సినిమాకి తొలిసారి కలిసి పనిచేసిన కమల్, మణిరత్నాలు కలిసి మళ్ళీ ఇన్నేళ్ళకు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గ్రేట్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకు సంబంధించి భారీ అప్ డేట్ ని అందిస్తారని మేకర్స్ చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Movies:ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్న కమల్ హాసన్-మణిరత్నం
ఇద్దరు లెజెండ్స్...ముప్పై ఏళ్ళ క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఆ సినిమా నాయకుడు అయితే...ఆ లెజెండరీ కాంబినేషన్ కమల్ హాసన్, మణిరత్నం. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక మూవీ చేస్తున్నారు. కేహెచ్ 234 గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
Translate this News: