Bank Account: ఖాతాదారులకు తెలియకుండానే ఎకౌంట్ నుంచి డబ్బు మాయం.. బాధితుల గగ్గోలు

బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఎకౌంట్ హోల్డర్ ప్రమేయం లేకుండానే డబ్బులు మాయం అయిపోయిన సంఘటనలు సుల్తానాబాద్ లో చోటుచేసుకున్నాయి. బండ రాజు అనే వ్యక్తి ఎకౌంట్ నుంచి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా లక్షరూపాయలు మాయం అయిపోయాయి. ఈ మేరకు బాధితుడు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాడు. 

Bank Account: ఖాతాదారులకు తెలియకుండానే ఎకౌంట్ నుంచి డబ్బు మాయం.. బాధితుల గగ్గోలు
New Update

AePS Scam: ఆన్ లైన్ లోనే  అన్ని ఆర్ధిక లావాదేవీలు జరిగిపోతున్నాయి. బ్యాంకుకు వెళ్లే అవసరం లేదు.. అసలు ఇటీవల కాలంలో డబ్బు వేయడం.. తీయడం ఏదైనా సరే బ్యాంకుతో పనిలేకుండానే జరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే కేటుగాళ్లకు వరంగా మారింది. ఆన్ లైన్ పేమెంట్స్ లో మోసాలు.. లింక్స్ పంపించి డబ్బు దోచేయడం.. ఇలా ఎన్నో రకాలుగా ప్రజల డబ్బులను కాజేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బ్యాంకులు ఎన్నిరకాలుగా జాగ్రత్తలు చెప్పినా.. ఎంత జాగ్రత్తగా ప్రజలు ఉన్నా ఎప్పటికప్పుడు తమ ఎకౌంట్స్  నుంచి డబ్బులు మాయం అయిపోయాయి అని చెబుతూ వచ్చే కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. ఇదిగో తాజాగా అటువంటి ఘటన ఒకటి సుల్తానాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

సుల్తానాబాద్ లోని (Sultanabad) యాదవనగర్ కు చెందిన బండ రాజుకు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు బ్రాంచిలో ఎకౌంట్(SBI Bank Account) ఉంది. అతనికి బుధవారం ఒక మెసేజ్ వచ్చింది. అందులో పదివేల రూపాయాలు ఎస్బీఐ నుంచి విత్ డ్రా అయినట్టు ఉంది. ఇది చూసిన రాజు షాక్ అయ్యాడు. ఎందుకంటే, తాను డబ్బు విత్ డ్రా చేయడం కానీ, ఆన్ లైన్ లో ఎవరికైనా పంపించడం కానీ చేయలేదు. వెంటనే బ్యాంకుకు పరుగెత్తిన రాజు తన ఎకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నాడు. అది తీసుకున్న తరువాత మరింత టెన్షన్ వచ్చింది రాజుకు. ఎందుకంటే.. అతని ప్రమేయం లేకుండానే పదిరోజుల నుంచి రోజుకు 10 వేల రూపాయల చొప్పున మొత్తం లక్ష రూపాయాలు రాజు ఎకౌంట్ నుంచి ఏఈపీఎస్‌ (AePS) అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా విత్ డ్రా అయినట్టు తేలింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న రాజు స్థానిక పోలీసులు ఇచ్చిన సలహాతో సైబర్ నేరాలకు (Cyber Crimes) సంబంధించి అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 1980 కి ఫిర్యాదు చేశాడు. 

ఇదొక్కటే కాదు ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఇటువంటి పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. సుల్తానాబాద్ లోని యాదవ నగర్ కు చెందిన చెందిన గెల్లు మహేందర్ 20000 రూపాయలు,  అలాగే సుల్తానాబాద్ కు చెందిన సదానందం 20000 రూపాయలు,  సుల్తానాబాద్ మండలం పెరిక పల్లి గ్రామానికి చెందిన మహేందర్ 30 వేల రూపాయలు తమ ప్రమేయం లేకుండానే తమ బ్యాంక్ ఎకౌంట్(Bank Account) నుంచి మాయం అయిపోయినట్టు ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులపై దర్యాప్తు జరుపుతున్నారు. 

Also Read: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే.. 

Watch this interesting Video:

#bank-account #withdraw
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe