స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ (Quash Petition) మీద ఈరోజు విచారణ జరిగిన విషయం తెలిసిందే. దీనితో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరిగింది. వీటిల్లో క్వాష్ పిటిషన్ మీద విచారణ వాయిదా పడింది. ఈ నెల ( సెప్టెంబర్)19వ తేదీకి ఈ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. దాంతో పాటూ ఈ నెల 18వరకు సీఐడీ వేసిన పిటిషన్స్ పై కూడా ఎలాంటి విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని ఏపీ హైకోర్టు (AP High Court)ను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు లాయర్లు. దీనిపై స్పందించిన కోర్టు సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై పూర్తి వాదనలు ఇంకా వినాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. అందుకే వాయిదా వేస్తున్నామని తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాజకీయ కుట్రలో భాగం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురించి చంద్రబాబు తరఫు న్యాయవాది శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. స్కిల్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకుండానే అరెస్ట్ చేశారని చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో ఆరోపించారు. అంతేకాదు రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే.. తనను తప్పుడు కేసులో ఇరికించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు.