/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/isro-jpg.webp)
Aditya-L1 : ఇస్రో (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. జాబిల్లి రహస్యాలను చేధించేందుకు చంద్రయాన్-3 (Chandrayaan 3) ని ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ..మరో ముందడుగు వేయబోతోంది. ప్రస్తుతం సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. తొలిసారిగా సూర్యుడిపై అధ్యయనం కోసం ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1)ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు.ఈ వ్యోమనౌక బరువు సుమారు 1,500 కిలోలు ఉంటుంది.
ఆదిత్య ఎల్–1లో మొత్తం ఏడు పేలోడ్లు వుంటాయి. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌ను అధ్యయనం చేసేందుకు ఏడు పేలోడ్స్‌తో ఆ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1..అంటే L-1చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెడతారు. అక్కడి నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుణ్ణి నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావం, సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనున్నారు. సూర్యుడి ఉపరితలంపై కూడా పరిశోధనలు చేయనున్నారు.
PSLV-C57/Aditya-L1 Mission:
Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is getting ready for the launch.
The satellite realised at the U R Rao Satellite Centre (URSC), Bengaluru has arrived at SDSC-SHAR, Sriharikota.
More pics… pic.twitter.com/JSJiOBSHp1
— ISRO (@isro) August 14, 2023
అంతరిక్ష ప్రయోగాల్లో ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ సాగుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును సాధించింది. ఇటీవల చేపట్టిన చంద్రయాన్–3తో తన లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో..వరుస ప్రయోగాలతో ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో మరింత వేగం పెంచింది. తొలిసారి సూర్యుడిపైకి రాకెట్‌ను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ‘ఆదిత్య-ఎల్1’తో సూర్యుడిపై పరిశోధనలకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే ఈ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు తెలిపింది.
ఇక శ్రీహరికోటలో (Sriharikota)ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23న ఈ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వనుంది. ఒకవేళ చంద్రయాన్ ల్యాండింగ్ అయితే చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. అమెరికా, రష్యా, చైనాల సరసన చేరి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించనుంది. చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను నిర్ధారించడానికి వివిధ ఎలక్ట్రానిక్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌లతో కూడిన నావిగేషన్ సెన్సార్లు, ప్రొపల్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా రోవర్‌ను సురక్షితంగా దించడానికి టూ-వే కమ్యూనికేషన్-సంబంధిత యాంటెనాలు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్ యంత్రాంగాలు ఉన్నాయి.