Bhavya sri: భవ్య శ్రీ హత్య కేసులో మిస్టరీ వీడడం లేదు. భవ్య శ్రీదేవిపై అత్యాచారం జరిగిందా? ఆత్మ హత్యనా? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవ్య శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి(స్పెషల్ ఎంప్రోస్మెంట్ బ్యూరో)తెలిపారు. అయితే, తల్లిదండ్రలు మాత్రం అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని..భవ్య శ్రీదేవి హత్య.. ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందని శ్రీలక్ష్మి అన్నారు.
అయితే, సోషల్ మీడియాలో అత్యాచారం, హత్య జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని..అయితే వాస్తవాలు తెలియకుండా ట్రోల్ చేయకండి అంటూ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి సూచించారు. ప్రాథమిక వివరాలు చూస్తే ఆత్మహత్య గా కనబడుతుందని చెప్పారు. అయితే, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి వ్యాఖ్యనించారు.
ఏపీలో ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది.