Bhavasri: నా బిడ్డను నేను ఎలా చంపుకుంటా.. పోలీసుల తీరుపై భవ్యశ్రీ పేరెంట్స్ ఫైర్..!
చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీ మర్డర్ మిస్టరీగానే మిగిలింది. భవ్యశ్రీ హత్యలో పోలీసుల దర్యాప్తుపై బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ భవ్యశ్రీ తల్లి వాపోతోంది. నిన్న ఇంటికి వచ్చిన పోలీసులు భవ్యశ్రీ హత్య రిపోర్ట్స్ వచ్చాయని అన్నారని ఆమె తెలిపింది. ఆ రిపోర్ట్స్ లో భవ్యశ్రీది ఆత్మహత్య అని తేలిందని.. నువ్వే వేధించి వుంటావని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.