Bhavya sri: భవ్య శ్రీ హత్య కేసుపై అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్స్..!! భవ్య శ్రీ హత్య కేసులో మిస్టరీ వీడడం లేదు. భవ్య శ్రీదేవిపై అత్యాచారం జరిగిందా?ఆత్మ హత్యనా? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవ్య శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి(స్పెషల్ ఎంప్రోస్మెంట్ బ్యూరో)తెలిపారు. అయితే, తల్లిదండ్రలు మాత్రం అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని ఆమె వెల్లడించారు. By Jyoshna Sappogula 26 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Bhavya sri: భవ్య శ్రీ హత్య కేసులో మిస్టరీ వీడడం లేదు. భవ్య శ్రీదేవిపై అత్యాచారం జరిగిందా? ఆత్మ హత్యనా? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవ్య శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి(స్పెషల్ ఎంప్రోస్మెంట్ బ్యూరో)తెలిపారు. అయితే, తల్లిదండ్రలు మాత్రం అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని..భవ్య శ్రీదేవి హత్య.. ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందని శ్రీలక్ష్మి అన్నారు. అయితే, సోషల్ మీడియాలో అత్యాచారం, హత్య జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని..అయితే వాస్తవాలు తెలియకుండా ట్రోల్ చేయకండి అంటూ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి సూచించారు. ప్రాథమిక వివరాలు చూస్తే ఆత్మహత్య గా కనబడుతుందని చెప్పారు. అయితే, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి వ్యాఖ్యనించారు. ఏపీలో ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది. బాలిక మృతదేహం చూసిన కొందరు యువకులు కేకలు వేస్తూ గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ బావి దగ్గరకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం భవ్యశ్రీదిగా గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి.. భవ్యశ్రీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెకు అర్థ శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మూడ్రోజులుగా శవం నీటిలోనే ఉన్నందున జుట్టు ఊడిపోయిందని, ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. అయితే గ్రామస్తులు, కుటుంబసభ్యులు మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అఘాయిత్యం జరిగిందా..? విషప్రయోగం జరిగిందా..? అనే దానిపై పరీక్షించేందుకు శాంపిల్స్‌ను తిరుపతి RFSLల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. Also Read: భద్రాచలంలో కొడుకును కడతేర్చిన తల్లిదండ్రలు..అసలు ఏం జరిగిందంటే..? #tirupati #ap-police #bhavya-sri-case-update #inter-girl-death-case #bhavya-sri-death మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి
బాలిక మృతదేహం చూసిన కొందరు యువకులు కేకలు వేస్తూ గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ బావి దగ్గరకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం భవ్యశ్రీదిగా గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి.. భవ్యశ్రీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెకు అర్థ శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మూడ్రోజులుగా శవం నీటిలోనే ఉన్నందున జుట్టు ఊడిపోయిందని, ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. అయితే గ్రామస్తులు, కుటుంబసభ్యులు మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అఘాయిత్యం జరిగిందా..? విషప్రయోగం జరిగిందా..? అనే దానిపై పరీక్షించేందుకు శాంపిల్స్‌ను తిరుపతి RFSLల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.