నాకు టికెట్ రాకుండా చేసింది వాళ్లే.. అద్దంకి సంచలన కామెంట్స్!

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు ఎవరి వాళ్ళ టికెట్ రాలేదు, ఎందుకు రాలేదు అనే దానిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

New Update
నాకు టికెట్ రాకుండా చేసింది వాళ్లే.. అద్దంకి సంచలన కామెంట్స్!

Addanki Dayakar: ఇప్పటికే అన్నీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ ను ఆర్టీవి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను ఆయన పంచుకున్నారు. తనకు టికెట్ రాకపోవడానికి గల కారణాలు, ఎవరి వల్ల తనకు టికెట్ రాలేదు అనే అంశంపై అద్దంకి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తనకే తుంగతుర్తి టికెట్ ఇస్తుందని అనుకున్నానని.. కానీ, వేరే వారికి టికెట్ ఇవ్వడం కొంత బాధ కలిగించిందని అన్నారు. కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ చూసి అందులో తన పేరు లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాయనని అన్నారు. తనకు టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నట్లు వార్తలు పుట్టగా.. ఆ ప్రచారాన్ని ఆపేందుకు ఒక వీడియో తీసి పెట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను ఏ పనినైనా చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మందుల సామెల్‌ను భారీ మెజారితో గెలిపిస్తామని అన్నారు. పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.

ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

Advertisment
తాజా కథనాలు