Tapsi : ఆ హీరోయిన్ వల్లే నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. తాప్సి షాకింగ్ కామెంట్స్!

హీరోయిన్ తాప్సి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంది. అందులో తనకు సినిమా అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.' ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్‌లో ఆఫర్స్‌ వస్తున్నాయి. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా' అని చెప్పింది.

New Update
Tapsi  : ఆ హీరోయిన్ వల్లే నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. తాప్సి షాకింగ్ కామెంట్స్!

Actress Tapsi Intresting Comments About Movie Offers : తెలుగు సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సి.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. 'ఝుమ్మంది నాదం' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్, రవితేజ, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఇక్కడ ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని నార్త్ లోనే సెటిలయింది.గతేడాది డంకీ, ధక్‌ ధక్‌ హిందీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తనకు అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.

Also Read : ‘లియో’ పార్ట్ – 2 కథ రెడీ.. కానీ : లోకేష్ కనగరాజ్

ఆ హీరోయిన్ వల్లే...

తాజా కార్యక్రమంలో తాప్సి మాట్లాడుతూ.." నటి ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్‌లో ఆఫర్స్‌ వస్తున్నాయి. ఆమె ఎంత పాజిటివ్‌ ఎనర్జీతో ఉంటారో మనందరికీ తెలుసు. నేను బాలీవుడ్‌లో ఉండేందుకు కారణమైన ప్రీతీకి ఎప్పుడూ చెడ్డపేరు తీసుకురాను. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా. నేను ఆమెను కేవలం బిగ్‌ స్క్రీన్‌పైనే చూశా" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తాప్సి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు