Actress Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఇతర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో తన అద్భుతమైన డాన్స్ మూవ్‌లతో ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ స్టెప్పులేసిన ఓ స్పెషల్ సాంగ్ బాలీవుడ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ కోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ ఫిల్మ్ 'స్త్రీ 2'. ఆగస్ట్ 15న విడుదలైన ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. ఈ పాట సినిమాకు బాగా హైప్ తీసుకొచ్చింది. అయితే స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందట.
Also Read : వెండితెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్.. నటించేది ఎవరంటే?
కేలవం 5 నిమిషాల నిడివి గల ఈ పాటకి రూ. కోటి తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తమన్నా ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె క్రేజ్‌ను బట్టి మేకర్స్ ఆమెకు ఈ రేంజ్ లో పారితోషకం ఇచ్చి ఉంటారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మిల్కీ బ్యూటీ తీసుకున్న రెమ్యునరేషన్ కు 100% న్యాయం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.