Sreeleela : ఎట్టకేలకు బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న శ్రీలీల.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

యంగ్ బ్యూటీ శ్రీలీలకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తాజా సమాచారం. సిద్దార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా ‘మిట్టి’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sreeleela : ఎట్టకేలకు బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న శ్రీలీల.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
New Update

Actress Sreeleela : టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నయంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌ బాట పట్టేందుకు సిద్ధమైంది. ఎట్టకేలకు ఈమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తాజా సమాచారం. బాలీవుడ్‌ స్టార్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటించే అవకాశం దక్కించుకుందట శ్రీలీల. సిద్దార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా ‘మిట్టి’ అనే సినిమా తెరకెక్కనుంది.

Also Read : కాలినడకన ఫ్యామిలీతో తిరుమలకు న్యాచురల్ స్టార్ నాని..

ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. సినిమాలో తన పాత్ర కీలకంగా ఉండటంతో శ్రీలీల ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పినట్లు తెలిసింది. అక్టోబర్‌లో ఈ సినిమా మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా శ్రీలీలకు మొదటి సినిమానే సిద్దార్థ్ మల్హోత్రా లాంటి స్టార్ తో జత కట్టే ఛాన్స్ రావడం విశేషం. మరి ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

#siddarth-malhotra #actress-sreeleela
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి