Samantha : మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమంత.. దాని కోసమేనా? సమంత ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈక్రమంలోనే వచ్చే ఏడాది నుంచి షూటింగ్‌లో పాల్గోనబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొత్త సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. By Anil Kumar 20 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actress samantha is learning martial arts and horse riding : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో సినిమాలు పక్కన పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. మళ్ళీ ఏడాది తర్వాత తాను సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈక్రమంలోనే తాను ప్రెజెంట్ మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.." వచ్చే ఏడాది నుంచి షూటింగ్‌లో పాల్గోనబోతున్న. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పటికే ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, అర్చరీ వంటివి నేర్చుకుంటున్నా. Also Read : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..! నాకు కూడా త్వరగా సెట్ అవ్వాలని ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 ఏళ్లలో చాలా ఒడిదుడుకులు అనుభవించాను. ముఖ్యంగా కిందపడి పైకి లేచాను. అయితే మళ్లీ నేను కొత్తగా రెడీ అవుతున్నా. ఒక స్టూడెంట్‌లా మళ్లీ కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నా" అంటూ పేర్కొంది. మరోవైపు సమంత ఇప్పటికే 'మా ఇంటి బంగారం' అనే సినిమాను అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో పాటూ మమ్ముట్టితో మలయాళంలో ఓ సినిమాకు సైన్ చేసింది. #actress-samantha #samantha-latest-interview మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి