/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T152307.077.jpg)
Samantha: హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్‌ను ఉపయోగించడం గురించి ఇటీవలే టాలీవుడ్ నటి సమంత చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఈ పోస్ట్ ఓ వైద్య నిపుణుడు(“ది లివర్ డాక్”) ఘాటుగా స్పందించాడు. దురదృష్టవశాత్తూ నటి సమంత ఆరోగ్యం, సైన్స్ తెలియని నిరక్షరాస్యురాలని. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం ప్రమాదకరమని సోషల్ మీడియా వేదికగా ఆమె పై ఫైర్ అయ్యారు. ఇక ప్రమాదకరమైన వైద్య విధానాలను ప్రచారం చేస్తున్నందుకు డాక్టర్లు ఆమె పై విమర్శలు గుప్పించడంతో సమంత క్లారిటీ ఇచ్చారు. తన ఇన్స్టా హ్యాండిల్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ ను విడుదల చేసింది.
Left: Influential Indian actress Ms. Samantha Ruth who is unfortunately a health and science illiterate advising millions of her followers to inhale hydrogen-peroxide to prevent and treat respiratory viral infections.
Right: Scientific society, The Asthma and Allergy Foundation… pic.twitter.com/Ihn2xocKUt
— TheLiverDoc (@theliverdr) July 4, 2024
సమంత తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది.
"గత కొన్నేళ్లుగా నేను చాలా రకాల మందులు వాడుతున్నాను. నేను సిఫార్సు చేసిన ప్రతిదాన్ని తీసుకున్నాను. ఈ సలహాలు చాలా అర్హత కలిగిన వ్యక్తులచే అందించబడ్డాయి. నేను వీలైనంత ఎక్కువ పరిశోధన చేసిన తర్వాతే సూచిస్తాను. నేను మంచి ఉద్దేశ్యంతో సూచించాను. ఒక పెద్దమనిషి నా పోస్ట్‌పై , నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. ఆయన కూడా ఒక వైద్యుడే. అతనికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో నాకు సందేహం లేదు. అతని ఉద్దేశాలు కూడా గొప్పవని ఖచ్చితంగా నమ్ముతున్నాను. కానీ అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా కాస్త మంచిగా చెప్పి ఉంటే బాగుండేది. ముఖ్యంగా అతను నన్ను జైలులో వేయాలని సూచించాడు. నేను ఒక సెలెబ్రెటీల కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వ్యక్తిగా ఆ పోస్ట్ చేసాను. ఆ పోస్ట్ నుంచి నేను ఎలాంటి డబ్బు సంపాదించడం లేదు అలాగే వాటిని ప్రమోట్ కూడా చేయడం లేదు.
ఆర్థికంగా కొంత మంది చికిత్సలను పొందలేరు. అలాంటి వారి కోసం నేను ఆలోచిస్తాను. 25 సంవత్సరాలుగా DRDOలో సేవలందించిన ఒక ఉన్నతమైన వైద్యుడు నాకు ఈ ప్రత్యామ్నాయ చికిత్సను సూచించారు. మెడికేషన్ పనిచేయనివారికి ఈ చికిత్సను (నెబ్యులైజేషన్) ఒక ఎంపికగా సూచించాను. నా పై పరిశోధన చేసిన తర్వాత నాలాంటి సామాన్యులకు సూచిస్తాను. “ది లివర్ డాక్” నన్ను టార్గెట్ చేయడం కంటే నా డాక్టర్‌తో ఇదే చర్చ జరిపి ఉంటే బాగుండేదని ఆమె పై ఫైర్ అయిన “ది లివర్ డాక్” కు బదులిచ్చింది సమంత."
View this post on Instagram
నెబ్యులైజేషన్ పద్ధతి గురించి మరో వైద్య నిపుణులు ఇలా అన్నారు..
HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముంబై వోక్‌హార్డ్ హాస్పిటల్ డాక్టర్ రితుజా ఉగాల్‌ముగ్లే ఇలా అన్నారు.. హైడ్రోజన్ పెరాక్సైడ్ , డిస్టిల్డ్ వాటర్ రెండూ సంభావ్య ప్రమాదాలను కలిగి ఉంటాయి. సాధారణంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ కోసం సిఫార్సు చేయబడదు. ఇది ఆక్సీకరణ ఒత్తిడికి కారణమై గొంతులో శ్లేష్మం, చికాకు ఇతర తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని పేర్కొన్నారు.
Also Read: Kumari Aunty: కుమారి ఆంటీకి సోనూసూద్ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్..! - Rtvlive.com