Rashmika Mandanna Deepfake Video : మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక.. ఈసారి ఏకంగా అలాంటి వీడియోతో

రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. ఈ వీడియోలో ఎవరో బ్లాక్ బికినీ ధరించిన అమ్మాయికి రష్మిక ఫేస్ ను యాడ్ చేశారు. దాన్ని రష్మిక డీప్ ఫేక్ వీడియో పేరుతో ఫేస్ బుక్ లో షేర్ చేశారు. రష్మిక ఫ్యాన్స్ ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika Mandanna Deepfake Video : మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక.. ఈసారి ఏకంగా అలాంటి వీడియోతో
New Update

Actress Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. తాజాగా ఆమెకు సంబంధించి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే రెండు సార్లు రష్మిక డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేయగా.. ఇప్పుడు మరోసారి ఇదే రీపీట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

లేటెస్ట్ వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలో ఎవరో బ్లాక్ బికినీ ధరించిన అమ్మాయికి రష్మిక ఫేస్ ను యాడ్ చేశారు. దాన్ని రష్మిక డీప్ ఫేక్ వీడియో పేరుతో ఫేస్ బుక్ లో షేర్ చేశారు. 'Priti Rajput' అనే ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ మొదట వీడియోలో ఉంది రష్మికనే అని అనుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. ఇక రష్మిక ఫ్యాన్స్ అయితే ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బిగ్ బాస్ సీజన్ – 8 లో టాలీవుడ్ యంగ్ హీరో..!

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గత ఏడాది నవంబర్ లో రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఈ వీడియోని ఎడిట్ చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రష్మిక తర్వాత ఆలియా భట్, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్స్ సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డ విషయం తెలిసిందే.

#rashmika-mandanna #rashmika-deep-fakevideo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe