/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-119.jpg)
Actress Rashmika Mandanna : విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నతమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ టాలీవుడ్ ఆడియన్స్ కు ఎంతో దగ్గరయ్యారు. ఫస్ట్ టైం ఈ ఇద్దరూ జంటగా 'గీత గోవిందం' (Geetha Govindam) సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు.ఈ మూవీ అటు విజయ్‌ని (Vijay Deverakonda), ఇటు రష్మికను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసింది. ఆ తరువాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో ఈ జంట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే హీరోయిన్ రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది. 'గీత గోవిందం' సినిమా సమయంలో రష్మికకు విజయ్ దేవరకొండను చూసి భయపడ్డానని చెప్పింది." కొత్త వ్యక్తులతో నేను అంత త్వరగా కలిసిపోలేను. వారితో మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ‘గీత గోవిందం’ సెట్‌లో తొలిసారి విజయ్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా.
అతని వ్యక్తిత్వం తెలిసే కొద్ది మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. విజయ్ చాలా కూల్‌గా ఉంటాడు. ఆయన సెట్‌లో ఉంటే అందరిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు" అని పేర్కొంది. దీంతో రష్మిక చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2, కుబేర, గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలతో బిజీగా ఉండగా.. అటు విజయ్ దేవరకొండ 'VD12' షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Follow Us