/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-4.jpg)
Actress Rambha Family With Thalapathy Vijay : సౌత్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోలందరితో ఆడిపాడిన రంభ చాలా సంవత్సరాల పాటూ అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా ఈమె.. ఇటీవల కాలంలో బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. అయితే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ ఫ్యామిలీతో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ను కలిశారు. ఇటీవల విజయ్‌తో రంభ కుటుంబసభ్యులు దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
EXCLUSIVE: Latest clicks of our Thalapathy VIJAY with Actress #Rambha 📸 #TheGreatestOfAllTime #Thalapathy69 @actorvijay pic.twitter.com/6mj1rdRWiz
— Actor Vijay Team (@ActorVijayTeam) July 17, 2024
ఇంతకీ రంభ విజయ్‌ను కలవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ 'గోట్' మూవీలో రంభ కూడా నటిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. షూటింగ్ లో భాగంగానే రంభ ఫ్యామిలీ విజయ్ ను కలిసి ఫోటోలు దిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
'గోట్' సినిమా విషయానికొస్తే.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో . ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.