Pooja Hegde: బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ..'సంకీ' లో హీరోయిన్ గా

యంగ్ బ్యూటీ పూజ హెగ్డే గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' హిందీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసింది. సాజిద్ న‌డియాడ్ వాలా బ్యాన‌ర్ లో తెరకెక్కుతున్న 'సంకీ' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

Pooja Hegde: బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ..'సంకీ' లో హీరోయిన్ గా
New Update

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ గతేడాది(2022)లో సౌత్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెంటెడ్ హీరోయిన్ గా వెలింగింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాదే శ్యామ్, ఆచార్య ఇలా వరుస సినిమాలతో దూసుకుపోయింది. కానీ 2023 లో ఈ అమ్మడు నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా రాలేదు. గతేడాది నుంచి తెలుగు చిత్రాలకు దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది.

Also Read: Tollywood : మన హీరోయిన్స్ ఒకదానికి కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే..

'సంకీ' లో బుట్ట బొమ్మకు ఆఫర్

రీసెంట్ గా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సాజిద్ న‌డియాడ్ వాలా బ్యాన‌ర్ లో అహ‌న్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న 'సంకీ' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ మూవీకి అద్నాన్ షేక్- యాసిర్ ఝా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు తెలిపారు మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సంకీ'  విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పూజ ఆశలన్నీ ఈ ప్రాజెక్టు పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

publive-image

ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ షాహిద్ కపూర్ సరసన 'దేవా' సినిమాలో కపూర్ నటిస్తోంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Also Read: NBK109 Glimpse : ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌”.. బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

#pooja-hegde-upcoming-movies #pooja-hedge-bollywood-film #pooja-hegde
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe