Payal Rajput: 'బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు'.. వైరలవుతున్న పాయల్ పోస్ట్..!

నటి పాయల్ రాజ్ పుత్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా విడుదలకు ఒప్పుకోకపోతే తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు అంటూ ఆమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.

Payal Rajput:  'బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు'.. వైరలవుతున్న పాయల్ పోస్ట్..!
New Update

Payal Rajput: ఆర్ఎక్స్ 100 తర్వాత ఒక్క హిట్ కూడా లేకుండా ఫేడ్ అయిపోయిన పాయల్.. మంగళవారం సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దీంతో పాయల్ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది.

అయితే అందరికీ సక్సెస్ మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. కానీ ఈ అమ్మడుకి మాత్రం కష్టాలను తెచ్చిపెట్టింది. మంగళవారం సినిమాతో తనకు వచ్చిన క్రేజ్ ను కొంత మంది వాడుకోవాలని చూస్తున్నారు అంటూ వాపోయింది పాయల్. అసలు విషయమేంటంటే.. పాయల్ రీసెంట్ ఫిల్మ్ మంగళవారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో.. ఇదే ఫార్మ్ లో ఆమె గత సినిమాలను కూడా అనుమతి లేకుండా విడుదల చేయాలని చూస్తున్నారట. దీంతో నటి పాయల్ తనకు న్యాయం చేయాలంటూ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ షేర్ చేసింది.

పాయల్ ట్వీట్

"2019- 20 లో 'రక్షణ' అనే సినిమా పూర్తి చేశారట పాయల్. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ పడుతూ వచ్చిందట. అయితే ఇటీవలే మంగళవారం సినిమాతో ఆమెకు సక్సెస్ రావడంతో ఆ క్రేజ్ ను వాడుకొని మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని పేర్కొంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండానే.. మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నట్లు పాయల్ వాపోయింది. రెమ్యునరేషన్ విషయంలో తన టీమ్ ప్పటికే మేకర్స్ ని సంప్రదించినప్పటికీ.. వారు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు రావడంలేదని చెప్పుకొచ్చింది.

పైగా సినిమా ప్రమోషన్స్ కు రాకపోతే తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వాపోయింది. తన ప్రమేయం లేకుండా మూవీలో ఆమె పేరు, పాత్ర ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పాయల్ పేర్కొంది. పాయల్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు." పాయల్ కు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

రక్షణ సినిమాలో పాయల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాయల్ ను ప్రమోషన్స్ లో పాల్గొనమని ఒత్తిడి చేస్తున్నట్లు ఆమె తెలిపింది. రెమ్యునరేషన్ విషయంలో తన టీమ్ ప్పటికే మేకర్స్ ని సంప్రదించినప్పటికీ.. వారు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు రావడంలేదని.

Devara : దేవర నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. కొత్త పోస్టర్ - Rtvlive.com

#payal-rajput #payal-social-media-post
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe