/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T170709.139.jpg)
Paruvu Trailer: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) ఇటీవలే పోలీసుల తో గొడవపడుతున్న వీడియో ఒకటి సోషల్ వైరలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందించడం కూడా జరిగింది. కొంతమంది పబ్లిసిటీ స్టెంట్ అని అంటే.. మరికొంతమంది ఇది కేవలం మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే అని కామెంట్స్ చేశారు. అయితే తాజాగా పోలీసులతో గొడవ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో బయటపడింది. ఇదంతా ఆమె నటించిన కొత్త సీరీస్ 'పరువు' కోసం చేసిన ప్రమోషన్ స్టెంట్ అని తెలిసిపోయింది. సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే నివేతా అలా చేసినట్లు మేకర్స్ తెలిపారు.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య (Naresh Agastya), మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరీస్ కు సిద్దార్థ్, రాజశేఖర్ సంయక్తంగా దర్శకత్వం వహించారు. గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్ పై మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించారు. తాజాగా ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ఈ సీరీస్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ జీ5 వేదికగా జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పరువు ట్రైలర్
ఇక 'పరువు' ట్రైలర్ చూస్తే.. నివేతా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రేమించుకుంటారు. అయితే కులం కారణంగా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళిపోతారు. ఇది తెలుసుకున్న వారి పేరెంట్స్ వెంటాడం మొదలుపెడతారు. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో హీరో, హీరోయిన్ హంతకులుగా మారడం చూపించారు. ఇక కులం, ప్రేమ, పగ, రాజకీయాలు, గౌరవం అనే ఈ సంక్లిష్టమైన పరిస్థితులను దాటుకొని వారిద్దరూ తమ ప్రేమను నిలబెట్టుకుంటారా..? లేదా..? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Really happy to release the trailer of #Paruvu
Looks really interesting.💯
And, will the couple really get away?Wait for the release on 14th June only on @Zee5Telugu#ParuvuOnZee5 @GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl @saranyapotla @Nivetha_Tweets @nareshagastya… pic.twitter.com/BQqmOihXIn
— Varun Tej Konidela (@IAmVarunTej) June 2, 2024