Meena: మహిళల పరువు తీసేలా వీడియోలు.. మంచు విష్ణు నిర్ణయంపై మీనా పోస్ట్ వైరల్!

మహిళలు, నటీనటులను అవమాన పరిచేలా మీమ్స్, వీడియోలు క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్లను రద్దు చేయించిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు కురిపించారు. విష్ణు అంకితభావం నిజంగా అభినందనీయమంటూ పోస్ట్ పెట్టారు.

New Update
Meena: మహిళల పరువు తీసేలా వీడియోలు.. మంచు విష్ణు నిర్ణయంపై మీనా పోస్ట్ వైరల్!

Mnchu Vishnu: మహిళలు, నటీనటులపై అసభ్యకరమైన వీడియోలు, మీమ్స్ క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్లపై నిషేదం విధించిన 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుపై సీనియర్ నటి మీనా ప్రశంసలు కురిపించారు. 18 ఛానల్స్‌ బ్యాన్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

ఈ మేరకు అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవడం గొప్ప విషయం. మంచు విష్ణు నేతృత్వంలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'కు ధన్యవాదాలు. సినీ పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీ అంకితభావం నిజంగా అభినందనీయం. పరువుకు భంగం కలిగించే కంటెంట్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. నెగిటివ్ కామెంట్స్‌ను ఎదిరించడంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలి. 'మా' అసోషియేషన్ ను రక్షించడంలో అందరి మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం. మంచు విష్ణు చాలా మంచి చేశారంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు