Actress Mamta Mohandas Interview : సౌత్ లో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో లో కింగ్, చింతకాయల రవి, యమదొంగ, కేడి వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయింది. తెలుగుతో పాటూ మలయాళంలో నటించి అక్కడ భారీ క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. దాంతో సినిమాలకు దూరమైంది.చాలా ఏళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది.
గతేడాది 'రుద్రంగి' సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే రజినీకాంత్ సినిమాలో అనవసరంగా నటించానని చెప్పింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : ప్రభాస్ ‘కల్కి’ పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్!
ఎడిటింగ్‌లో తీసేసారు...
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమాలో మమతా మోహన్ దాస్ ఓ సాంగ్‌లో నటించింది. ఈ పాట కోసం రెండు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లిందట. అయితే ఈ సినిమా ఎడిటింగ్‌లో ఆమె పార్ట్ మొత్తం డిలీట్ చేసి.. కేవలం ఒక సెకను మాత్రం తెరపై చూపించారట. రిలీజ్ తర్వాత ఆ పాటను చూసి తెగ ఫీలయిందట. అనవసరంగా రజనీకాంత్ సినిమాలో నటించానని అప్పట్లో తాను బాధపడ్డట్లు తాజా ఇంటర్వ్యూలో మమతా మోహన్ దాస్ పేర్కొంది.
Mamta Mohandas : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో రజినీకాంత్ సినిమాలో అనవసరంగా నటించానని చెప్పింది.'కథానాయకుడు' సినిమాలో తాను ఓ సాంగ్ చేస్తే ఎడిటింగ్ లో తీసేశారని చెప్పింది. రిలీజ్ తర్వాత సాంగ్ లేకపోవడంతో ఆ టైం లో బాధపడ్డానని పేర్కొంది.