Mamta Mohandas : పెళ్లి పై నోరు విప్పిన 'ఎన్టీఆర్' హీరోయిన్.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కామెంట్స్!

హీరోయిన్ మమతా మోహన్ దాస్ తాజగా ఓ ఇంటర్వూలో పాల్గొంది. ఇందులో ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్‌నర్‌ కోసం వెతుకుతున్నా అని చెప్పింది.

Mamta Mohandas : పెళ్లి పై నోరు విప్పిన 'ఎన్టీఆర్' హీరోయిన్.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కామెంట్స్!
New Update

Actress Mamta Mohandas About Her Marriage : టాలీవుడ్ లో కింగ్, చింతకాయల రవి, యమదొంగ, కేడి వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్. తెలుగుతో పాటూ మలయాళంలో నటించి అక్కడ భారీ క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. దాంతో సినిమాలకు దూరమైంది.

చాలా ఏళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. గతేడాది 'రుద్రంగి' సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇ‍చ్చింది. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వూలో తన వ్యక్తిగత జీవితంపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి స్పందించింది.

డేటింగ్ లో ఉన్నా.. కానీ?

తాజా ఇంటర్వ్యూలో మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.." గతంలో లాస్‌ఎంజిల్స్‌లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్‌లో ఉన్నా. కానీ ఆ రిలేషన్‌ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్‌లో రిలేషన్‌ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు.

ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్‌నర్‌ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే" అని చెప్పుకొచ్చింది.

#actress-mamta-mohandas #mamta-mohandas-interview
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe