Actress Madhavi: తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) గెలవడం మీద నటి మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ (BRS) కు 99శాతం మార్కులు వేస్తానని అన్నారు. దీంతో పాటూ తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో వచ్చే ఐదేళ్ళలో ప్రజలకు దక్కేవి ఇవే అంటూ కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరగబోయే దారుణాలు ఇవే అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తెలంగాణలో వచ్చే ఐదేళ్ళ తర్వాత 1. ఫుడ్ ఉండదు 2. ఉద్యోగాలు ఉండవు 3. మహిళలకు రక్షణ ఉండదు 4. హిందువుల పండగలు ఉండవు 5. శాంతి ఉండదు అంటూ పోస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యమని చెబుతూ ఎంజాయ్ గుడ్ లక్ కాంగ్రెస్ లవర్స్ అంటూ ఆమె పోస్టు పెట్టారు.
మాధవీలత (Actress Madhavi) స్నేహితుడా, నచ్చవులే, అరవింద్ 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటివి జరుగుతాయని సంచలనం కామెంట్స్ చేసింది. తనపై ఎన్ని వివాదాలు జరిగినా, ఎంత ట్రోలింగ్ ఎదురైనా మాధవీలత ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సినిమా అవకాశాలు తగ్గాక.. ఆమె పాలిటిక్స్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో పార్టీలో చేరారు. గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై ఇలా సంచనల పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.