Ramayanam : 'రామాయణం' నుంచి మరో అప్డేట్ వైరల్.. కైకేయి పాత్రలో లారా దత్తా..!

నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'రామాయణం'. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. రామాయణం చిత్రంలో కైకేయి పాత్రలో నటి లారా దత్తా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Ramayanam : 'రామాయణం' నుంచి మరో అప్డేట్ వైరల్.. కైకేయి పాత్రలో లారా దత్తా..!

Ramayanam Update : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో రణ్బీర్(Ranbir), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రామాయణం. ఈ చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇప్పటికే షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవలే రామాయణ సెట్స్ నుంచి లీకైన రణ్బీర్, సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. రామాయణం చిత్రంలో నటి లారా దత్తా(Lara Dutta) కైకేయి పాత్రలో నటించబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి దర్శకుడు నితీష్ తివారీ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. తాజాగా నటి లారా దత్తా దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Lara Dutta

కైకేయి పాత్రపై లారా దత్తా కామెంట్స్

ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. రామాయణంలో నా పాత్ర గురించి వస్తున్న వార్తలు వింటున్నాను. ఆ విషయాలు వింటూ నేను కూడా ఆనందిస్తున్నాను. రామాయణం సినిమాలో భాగం కావాలని ఎవరు కోరుకోరు? రామాయణంలో చాలా పాత్రలో ఉన్నాయి.. శూర్పణఖ , మండోదరి, కైకేయి ఇలా ఎవరి పాత్రనైనా పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే లారా ఇచ్చిన సమాధానంతో కూడా కైకేయి పాత్ర పై క్లారిటీ రాలేదు. మరీ లారా కైకేయి పాత్ర చేస్తున్నారా..? లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో సాయి పల్లవి, సీత. సన్నీ డియోల్ హనుమంతుడిగా, యష్ రావణుడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది అంటే 2025 దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం.

Also Read: Ranbir kapoor: 3 సంవత్సరాల కష్టం … ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisment
తాజా కథనాలు