మోదీని ఇటివలీ కాలంలో కొంతమంది రాముడుగా అభివర్ణిస్తున్నారు. వందల ఏళ్ల నాటి రామమందిర నిర్మాణం మోదీ హయంలోనే పూర్తికావడం.. ప్రారంభంకావడమే దీనికి ప్రధాన కారణం. రాముడితో మోదీకి ఉన్న పాలనా పోలికలను హైలెట్ చేస్తూ ఆయన్ను ఇలా కీర్తిస్తున్నారు. ఇక బీజేపీ అంటే ప్రేమానురాగాలు కురిపించే నటి కంగనా రనౌత్ మరోసారి అవే కురిపించారు. మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశారు. రాముడి అవతారమే మోదీనని చెప్పుకొచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కంగనా బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఆమె హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటి చేస్తున్నారు.
మోదీ రాముడే:
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బాబా భూత్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఇక ఆ తర్వాత కంగనా మోదీపై కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ సాధారణ వ్యక్తి కాదన్నారు కంగనా. ఇది మనందరికీ తెలుసన్నారు. 600 ఏళ్లలో నిర్మించని రామ మందిరం (అయోధ్యలో) మోదీ ద్వారా దేవుడు నిర్మించాడన్నారు. బీజేపీ మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదరి.. తనకు మోదీలో రాముడి భాగమే కనిపిస్తున్నదన్నారు కంగనా. ఆయన ఆర్మీలో తాను ఉన్నాను.. ఇప్పుడు రామసేతు నిర్మాణంలో ఉడుతలా ఉన్నానన్నారు. బీజేపీకి సహకరించాలని ఓటర్లను కోరారు. ఇది తనకు దక్కిన అదృష్టమని తెలిపారు.
జైరామ్‌తో కంగనా:
సర్కాఘాట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాంటా, ఫతేపూర్, హరిబైహ్నా, గోపాల్‌పూర్, మౌహిలలో కంగనా రనౌత్ ప్రచారం చేశారు. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ కొండ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కూడా పోటీకి దింపింది. ఇటీవల బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ మండిలో కంగనాను కలిశారు.
Also Read: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.!