Janhvi Kapoor : మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న జాన్వీ కపూర్.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్!

జాన్వీ కపూర్ తెలుగులో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.'దసరా' మూవీతో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు రెండో సారి కలిసి సినిమా చేస్తున్నారు. ఇందులోనే హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. ఆ‍ల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Janhvi Kapoor : మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న జాన్వీ కపూర్.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్!

Actress Janhvi Kapoor Gets Another Tollywood Offer : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'దేవర' మూవీతో సౌత్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ సినిమాలో 'తంగం' అనే పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో యాక్ట్ చేసే ఛాన్స్ అందుకుంది. బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RC16 మూవీలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.'దసరా' మూవీతో  పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు రెండో సారి కలిసి సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. ఆ‍ల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

Also Read : నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ ‘దిల్‌రుబా’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని మేకర్స్ భావించారట. అటు కూడా జాన్వీ ఈ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు