/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-05T104524.160.jpg)
Actress Imanvi: 'కల్కి' తో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే తన నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఆగస్టు 17న పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా కొత్త హీరోయిన్ ను పరిచయం చేశారు మేకర్స్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రభాస్ జంటగా నటించేందుకు ఎంతో మంది అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ కొత్త అమ్మాయిని పరిచయం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్ జంటగా నటించనున్న ఈ బ్యూటీ తొలి చూపులోనే ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. సోషల్ మీడియాలో ఈమెను నయా క్రష్ అని కూడా పిలుస్తున్నారు. ప్రభాస్ జోడిగా నటించనున్న ఈ నయా క్రష్ పేరు ఇమాన్ ఇస్మాయిల్ అంటే ఇమాన్వి. /rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Snapinsta.app_455800259_489095317402893_1369578147104617225_n_1080-e1725522919107.jpg)
Image Credits: Imanvi/Instagram
ఇక ప్రభాస్ జోడిగా నటించబోతున్న ఈ బ్యూటీ గురించి ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఇమాన్వి ఎవరు? ఆమె నటించిన సినిమాలేంటి? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇమాన్వి గురించి ఇప్పుడు తెలుసుకుందాము
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Snapinsta.app_448356736_439046062357203_7626977722025869187_n_1080.jpg)
ఇమాన్వి ఢిల్లీకి చెందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్‌లో 1.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 913K లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతే కాదు ఈ బ్యూటీ కంటెంట్ క్రియేటర్ కూడా. తరచూ సోషల్ మీడియాలో తన డాన్స్ రీల్స్, వీడియోలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
Image Credits: Imanvi/Instagram
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Snapinsta.app_330929794_213602797910559_3879957042509874002_n_1080.jpg)
ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ ఇలియాస్ ఖురేషి దర్శకత్వం వహించిన 'బీయింగ్ సారా' షార్ట్ ఫిల్మ్ తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2023లో 'ఎనిమీ'లోని 'తుమ్ తుమ్' ఆల్బమ్ లో ఆమె డాన్స్ మూవ్స్ తో ఫుల్ పాపులరైంది.
Image Credits: Imanvi/Instagram
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Snapinsta.app_448365888_981422356866416_3177349617864700893_n_1080.jpg)
ఇక ఇమాన్వి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇమాన్వి పాకిస్తాన్ సైనిక అధికారి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ కుమార్తె. ఢిల్లీలో జన్మించిన ఇమాన్వి ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లింది. ఎంబీఏ పూర్తి చేసిన ఇమాన్వీ ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టి మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇమాన్వి పూర్తి పేరు ఇమాన్ ఇక్బాల్ ఇస్మాయిల్ కానీ ప్రేక్షకులకు మాత్రం ఇమాన్వీ గా పరిచయం.
Image Credits: Imanvi/Instagram
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Snapinsta.app_153592420_746072736315517_2903638496483930639_n_1080.jpg)
Image Credits: Imanvi/Instagram
Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ? - Rtvlive.com
Follow Us