/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-25-3.jpg)
Vishwambhara: బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.
విశ్వంభరలో ఆషిక ఎంట్రీ
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో బ్యూటీ చిరంజీవి సరసన నటించేందుకు విశ్వంభర సెట్స్ లో అడుపెట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నటి ఆషిక రంగనాథ్ మెగాస్టార్ సరసన కనిపించబోతున్నట్లు తెలిపారు.
Welcoming the charming @AshikaRanganath to our EPIC CINEMATIC JOURNEY alongside Megastar @KChiruTweets in the mighty #Vishwambhara 🔮✨
Brace yourselves for a BLOCKBUSTER EXPERIENCE 🎥
Coming to cinemas on January 10th, 2025 🌠@trishtrashers @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/WpuAx4UDqh
— UV Creations (@UV_Creations) May 24, 2024
ఆషిక రంగనాథ్
ఆషిక రంగనాథ్ అమిగోస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా కింగ్ నాగార్జునతో 'నా సామి రంగ' చిత్రంలో మెరిసింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో జత కట్టేందుకు సిద్ధమైంది. మరి ఈ భామ విశ్వంభరలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నెలకొంది.