Actress Anasuya Bharadwaj : నటి అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆమె ట్వీట్లు నెట్టింట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఆమె ధైర్యమైన వ్యక్తిత్వం, వివాదాస్పద అంశాలపై స్పందనలు ఆమెను ఎప్పుడూ వార్తల్లో నిలుపుతాయి. తాజాగా ఓ పోస్ట్‌తో అనసూయ మరోసారి నెట్టింట చర్చనీయాంశమయ్యారు. అనసూయ తన ట్విట్టర్ లో.. " మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే నాపై కాదు తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి...
కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అంటూ రాసుకొచ్చింది. అనసూయ ఈ ట్వీట్ ను ఏ సందర్భంలో చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది స్పష్టంగా తెలియదు. అయితే, సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒకరి పనితీరు, నైపుణ్యాలు, లేదా వ్యక్తిత్వంపై విమర్శగా భావించబడతాయి.
Also Read : విజయ్ ‘గోట్’ లో పాట పాడిన కోలీవుడ్ స్టార్ హీరోయిన్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
అనసూయ ఈ ట్వీట్ ద్వారా ఒక వర్గాన్ని లేదా వ్యక్తిని అవమానించాలని అనుకున్నారా? లేదా తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచాలని అనుకున్నారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది ఆమెను బహిరంగంగా విమర్శిస్తూ, ఆమె వ్యాఖ్య అనుచితమని, మహిళా సాధికారతకు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఆమెను సమర్థిస్తూ, ఆమె తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచే హక్కును ఉపయోగించుకున్నారని వాదిస్తున్నారు.